Flipkart Republic Day Sale :ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే జాతర..ఐఫోన్ 16 ధర చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
ఐఫోన్ 16 ధర చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Flipkart Republic Day Sale : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 17న గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాదిలో వస్తున్న మొదటి అతిపెద్ద సేల్ కావడంతో కంపెనీ భారీ అంచనాలతో ఉంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్, యాప్‌లో దీనికి సంబంధించిన బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. కేవలం స్మార్ట్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కళ్లు చెదిరే డీలర్స్ ఉండబోతున్నాయి.
ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. వీరు సాధారణ వినియోగదారుల కంటే 24 గంటల ముందే, అంటే జనవరి 16వ తేదీ నుంచే సేల్‌లోకి ప్రవేశించి తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల స్టాక్ అయిపోకముందే బెస్ట్ డీల్స్ సొంతం చేసుకునే అవకాశం వీరికి ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడేవారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఈ సేల్‌లో అందరి కళ్లు ఆపిల్ ఐఫోన్ 16 పైనే ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై ఎప్పుడూ లేని విధంగా భారీ ధర తగ్గింపు ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు సామ్‌సంగ్ గెలాక్సీ S25 వంటి ప్రీమియం ఫోన్లపై కూడా బ్యాంక్ ఆఫర్లతో కలిపి భారీ డిస్కౌంట్ దక్కే అవకాశం ఉంది. బడ్జెట్ తక్కువ ఉన్నవారు పోకో, రియల్‌మీ వంటి 5G ఫోన్లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభించే నథింగ్ బ్రాండ్ ఫోన్ల మీద కూడా స్పెషల్ ఆఫర్లు ఉండబోతున్నాయి. నథింగ్ ఫోన్(2a), ఫోన్(3a), కొత్తగా వచ్చిన CMF ఫోన్(2) ప్రో మోడళ్లపై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డు ఉన్నవారికి కొన్ని వస్తువులపై అదనంగా రూ.400 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి కొత్త గ్యాడ్జెట్స్ కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం.

