Flipkart Sale 2026: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ అరాచకం..ఐఫోన్ 16 ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఐఫోన్ 16 ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Flipkart Sale 2026: యాపిల్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది.. మీరు ఎప్పటి నుంచో ఐఫోన్ 16 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆ సమయం రానే వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026ను రేపటి నుంచే అంటే జనవరి 16 నుంచే ప్రారంభించబోతోంది. ఈ సేల్‌లో వేలకొద్దీ ప్రొడక్టులపై డిస్కౌంట్లు ఉన్నప్పటికీ, అందరి కళ్లు మాత్రం ఐఫోన్ 16 ధర పైనే ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో తాజాగా ప్రత్యక్షమైన ఒక బ్యానర్ ద్వారా ఈ ఫోన్ ఎంత ధరకు లభించబోతుందో క్లారిటీ వచ్చేసింది.
ఐఫోన్ 16 బేస్ వేరియంట్ (128జీబీ) ప్రస్తుతం మార్కెట్లో రూ.64,900 ధరకు అమ్ముడవుతోంది. కానీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కేవలం రూ.56,999 కే సొంతం చేసుకోవచ్చని కంపెనీ హింట్ ఇచ్చింది. అంటే దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకు భారీ తగ్గింపు లభించబోతోంది. అయితే, ఇది డైరెక్ట్ డిస్కౌంటా లేక బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిపి ఈ ధర ఉంటుందా అనే దానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా అయితే బ్యాంక్ కార్డ్ ఆఫర్లు ఉపయోగించిన తర్వాతే ఈ ధర కనిపిస్తుంది.
మీ దగ్గర పాత ఐఫోన్ లేదా ఏదైనా మంచి కండిషన్‌లో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే, దానిని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ ధరను ఇంకా తగ్గించుకోవచ్చు. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ లేదా ఐసీఐసీఐ వంటి బ్యాంక్ కార్డ్‌ల మీద ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభించనుంది. ఒకేసారి అంత డబ్బు చెల్లించలేని వారి కోసం నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉండబోతోంది. అంటే నెలవారీ చిన్న మొత్తాలతో మీరు మీ కలల ఐఫోన్‌ను జేబులోకి వేసుకోవచ్చు.
ఐఫోన్ 16లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంటుంది. వేగవంతమైన పనితీరు కోసం లేటెస్ట్ A18 బయోనిక్ ప్రాసెసర్‌ను యాపిల్ వాడింది. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక వైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు వైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. మార్కెట్లో దీనికి పోటీగా శాంసంగ్ గెలాక్సీ S25, వన్‌ప్లస్ 13 వంటి మోడల్స్ ఉన్నప్పటికీ, ఐఫోన్ క్రేజ్ ముందు అవి దిగదుడుపే అని చెప్పాలి.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ సేల్ కొన్ని గంటల ముందే అందుబాటులోకి రావచ్చు. ఐఫోన్ల మీద వచ్చే ఇలాంటి క్రేజీ డీల్స్ సెకన్ల వ్యవధిలోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంటాయి. కాబట్టి రేపు సేల్ ప్రారంభం కాగానే ఆలస్యం చేయకుండా ఆర్డర్ చేసుకోవడం ఉత్తమం. ఈ రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 16 మాత్రమే కాకుండా ఐఫోన్ 15, ఐఫోన్ 14 మోడల్స్ మీద కూడా భారీ తగ్గింపులు ఉండే అవకాశం ఉంది.

