Apple iPhone : ఐఫోన్ ధరల బ్రేక్ అప్.. రూ. 64 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు ఎలా పెరిగాయంటే..!
రూ. 64 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు ఎలా పెరిగాయంటే..!

Apple iPhone : ఆపిల్ కంపెనీ తాజాగా ఐఫోన్ 17 సిరీసును భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే, కొత్త సిరీస్ బుక్ చేసుకునే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. గత నాలుగేళ్లలో మొదటిసారిగా ఐఫోన్ ధరలను ఆపిల్ పెంచింది. 2019 నుంచి ఇప్పటి వరకు ఐఫోన్ బేస్ మోడల్ ధర 28 శాతం పెరిగింది.
బేస్ వేరియంట్ ధరలు ఇలా పెరిగాయి..
2019: ఐఫోన్ 11ను రూ. 64,900 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు.
2020: ఐఫోన్ 12ను రూ. 69,990తో లాంచ్ చేశారు.
2021: ఐఫోన్ 13 ధరలో భారీ పెరుగుదల కనిపించింది. దీనిని రూ. 79,990కి లాంచ్ చేశారు, అంటే ఒకేసారి రూ. 10 వేలు పెరిగింది.
2022-2024: ఐఫోన్ 14, ఐఫోన్ 15, ఐఫోన్ 16 మోడల్స్ ధరలలో ఎలాంటి మార్పులు లేవు. వీటిని కూడా రూ. 79,990కి లాంచ్ చేశారు.
2025: తాజాగా లాంచ్ అయిన ఐఫోన్ 17 ధర రూ. 79,990 నుంచి రూ. 82,900కి పెరిగింది.
ప్రో వేరియంట్ల ధరలు ఇలా..
2020: ఐఫోన్ 12 ప్రో ధర రూ. 1,19,900.
2021: ఐఫోన్ 13 ప్రో ధర రూ. 1,19,900.
2022: ఐఫోన్ 14 ప్రో ధర రూ. 1,29,900.
2023: ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900.
2024: ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,900.
2025: తాజాగా ఐఫోన్ 17 ప్రో ధర రూ. 1,34,900కి పెరిగింది.
ప్రో మ్యాక్స్ వేరియంట్ల ధరలు..
2020: ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,29,900.
2021: ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,29,900.
2022: ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,39,900.
2023: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,59,900.
2024: ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,44,900.
2025: తాజాగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,49,900కి పెరిగింది.
ప్లస్ వేరియంట్ల ధరలు మాత్రం..
ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 16 ప్లస్ వేరియంట్ల ధరలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ మూడు మోడల్స్‌ను రూ. 89,900 ప్రారంభ ధరతోనే లాంచ్ చేశారు.
