ఎల్ఐసీ కొత్త పెన్షన్ ప్లాన్!

LIC: ప్రతి ఒక్కరికీ తమ పదవీ విరమణ తర్వాత జీవితం ఎలా ఉండాలనే దాని గురించి ఆలోచించడం చాలా అవసరం. ఎందుకంటే, ఆ సమయంలో నెలవారీ ఖర్చులను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అలాంటి వారికోసం, మీ వృద్ధాప్యాన్ని ఆర్థికంగా సురక్షితం చేసే ఒక అద్భుతమైన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీరు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందే అవకాశం ఉంది. నెలవారీ పెన్షన్ పొందడానికి ఒక మంచి పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే..ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టే ముందు మీరు ఈ 5 ముఖ్య విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పథకం ఒకేసారి పెట్టుబడి పెట్టే, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, తక్షణ పెన్షన్ ప్లాన్ (ఇమీడియట్ ఎన్యుటీ ప్లాన్) ఇది. ఈ పాలసీలో మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత నుంచే పెన్షన్ రావడం మొదలవుతుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే.. మీరు 40 సంవత్సరాల వయస్సు నుంచే పెన్షన్ పొందడం ప్రారంభించవచ్చు. 40 నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టి పెన్షన్ పొందవచ్చు.

రెండు రకాలుగా ప్లాన్: సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్

ఈ ప్లాన్‌ను మీరు రెండు రకాలుగా ఎంచుకోవచ్చు. మొదటిది సింగిల్ లైఫ్, రెండవది జాయింట్ లైఫ్

సింగిల్ లైఫ్: ఈ ఎంపికలో, పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం అతనికి పెన్షన్ వస్తుంది.

జాయింట్ లైఫ్: ఇది భార్యాభర్తలు ఇద్దరికీ వర్తిస్తుంది. ఇందులో, ప్రధాన పాలసీదారుడు (ప్రైమరీ పాలసీ హోల్డర్) జీవించి ఉన్నంత కాలం పెన్షన్ పొందుతారు. వారి మరణం తర్వాత, జీవిత భాగస్వామికి (జీవించి ఉన్నవారికి) పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ ఇద్దరూ మరణిస్తే, అప్పుడు జమ చేసిన మొత్తం నామినీకి ఇవ్వబడుతుంది.

ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్‌లో మీకు వచ్చే పెన్షన్ నేరుగా మీరు చేసిన పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే, మీకు అంత ఎక్కువ పెన్షన్ లభిస్తుంది.

ఉదాహరణకు: మీరు 60 సంవత్సరాల వయస్సులో ఈ ప్లాన్‌లో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు సంవత్సరానికి రూ. 64,350 పెన్షన్ వస్తుంది. జాయింట్ లైఫ్ ప్లాన్‌లో, మీ వయస్సు 60 సంవత్సరాలు, మీ భార్య వయస్సు 55 సంవత్సరాలు అయితే మీకు సంవత్సరానికి రూ. 61,600 పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ మీరు మరణిస్తే, పెట్టుబడి పెట్టిన మొత్తం మీ నామినీకి లభిస్తుంది. మీరు ఈ పెన్షన్‌ను మీ వీలును బట్టి నెలవారీ, మూడు నెలలకోసారి (త్రైమాసిక), ఆరు నెలలకోసారి (అర్ధ వార్షిక) లేదా సంవత్సరానికి ఒకసారి పొందవచ్చు.

లోన్ సౌకర్యం కూడా

ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. మీరు ఈ ప్లాన్ ద్వారా లోన్ కూడా తీసుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన సరిగ్గా 6 నెలల తర్వాత మీరు లోన్ తీసుకోవడానికి అర్హులు అవుతారు. ఇది వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story