బంగారం, వెండి ధరల్లో సరికొత్త రికార్డు

Gold Price : సోమవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశీయ డెరివేటివ్ మార్కెట్‌లో బంగారం ధర ఏకంగా రూ.1,350 పెరగగా, వెండి ధర రూ.2,000కు పైగా పెరిగి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అమెరికాలో ఏర్పడిన షట్‌డౌన్ కారణంగానే ఈ అసాధారణ పెరుగుదల చోటుచేసుకుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సురక్షితమైన మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు.ఈ కారణం వల్లే పసిడి ధరలు అమాంతం పెరిగాయి.

ప్రధాన నగరాలలో సోమవారం (అక్టోబర్ 6, 2025) నాటికి 10 గ్రాముల బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,20,920 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,10,850 , 18 క్యారెట్ల ధర రూ.90,730గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,20,660, 22 క్యారెట్ల ధర రూ.1,10,600, 18 క్యారెట్ల ధర రూ.91,600గా ఉంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,20,770, 22 క్యారెట్ల ధర రూ.1,10,700, 18 క్యారెట్ల ధర రూ.90,580 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,770, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.1,10,700లుగా నమోదైంది.

బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. వెండి ధర రూ.1,680 పెరిగి రూ.1,47,424 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక్క అక్టోబర్ నెలలోనే వెండి ధర ఏకంగా 3.90 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి జోరు కొనసాగుతోంది. న్యూయార్క్ డెరివేటివ్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 3,950 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, ఇది త్వరలోనే 4,000 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉంది. గత ఒక సంవత్సరంలో గోల్డ్ ఫ్యూచర్ ధరలు 49 శాతం పెరిగాయి. ఈ సంవత్సరంలో కూడా దాదాపు 50 శాతం పెరుగుదల నమోదైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story