యూపీఎస్‌తో ఉద్యోగులకు డబుల్ బెనిఫిట్

UPS : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కొత్తగా వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తో ఉద్యోగులకు డబుల్ బెనిఫిట్ లభిస్తుంది. అదేంటంటే, గ్యారెంటీ పెన్షన్ తో పాటు, ఈ పథకంలో ప్రభుత్వం చెల్లించే వాటా (కంట్రిబ్యూషన్) కూడా ఎన్‌పీఎస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా, యూపీఎస్‌లో ఖచ్చితమైన నెలవారీ పెన్షన్ వస్తుంది. అంటే, రిటైర్‌మెంట్ తర్వాత మార్కెట్ ఎలా ఉన్నా, మీరు భయపడాల్సిన పనిలేదు. ఒకవేళ 25 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు చేస్తే, చివరి జీతంలో సగం పెన్షన్‌గా వస్తుంది. 10 ఏళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్నా నెలకు కనీసం రూ.10,000 గ్యారెంటీ పెన్షన్ ఉంటుంది. అంతేకాదు, పెన్షన్‌కు ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ కూడా పెరుగుతుంది.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. ఈ పథకంలో ఉద్యోగి తన జీతంలో 10శాతం ఇస్తే, ప్రభుత్వం కూడా అంతే ఇస్తుంది. కానీ, అదనంగా మరో 8.5శాతాన్ని ఒక స్పెషల్ ఫండ్ లో జమ చేస్తుంది. అంటే, యూపీఎస్‌లో ప్రభుత్వం మొత్తం 18.5శాతం వాటాను ఇస్తుంది, ఇది ఎన్‌పీఎస్‌లో (14శాతం) కంటే ఎక్కువ. ఈ కొత్త యూపీఎస్‌కు ఎన్‌పీఎస్ లాగే పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కాబట్టి, ఉద్యోగులకు ఇది పన్ను ఆదా చేయడంలోనూ సహాయపడుతుంది. సురక్షితమైన, స్థిరమైన పెన్షన్‌తో పాటు పెరిగిన ప్రభుత్వ వాటాతో, యూపీఎస్ నిజంగా ఉద్యోగులకు ఒక మంచి అవకాశం.

PolitEnt Media

PolitEnt Media

Next Story