ముందు ఈ 6 పనులు చేశారా ?

PM Kisan : దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయానికి సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో ఇప్పటివరకు 19 విడతల డబ్బులు విడుదలయ్యాయి. ఇప్పుడు 20వ విడత డబ్బుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి జూన్ నెలలోనే 20వ విడత డబ్బులు వస్తాయని చాలామంది ఆశించారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉన్న ఈ కాలానికి సంబంధించిన డబ్బులు ఇదే నెలలో (జూలై) ఖచ్చితంగా విడుదలవుతాయి. అయితే, ఈసారి డబ్బులు అందరికీ వస్తాయా లేదా అనేది ఒక ప్రశ్న. ఈసారి డబ్బులు రావాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని ప్రభుత్వం తెలిపింది.

త్వరలో 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,000ల చొప్పున విడుదల కానుంది. అయితే, పథకంలో నమోదు చేసుకున్న అందరికీ ఈ విడత డబ్బులు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. కొన్ని నిబంధనలను పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ డబ్బు అందుతుంది. పీఎం కిసాన్ పథకం 20వ విడత డబ్బులు అందుకోవడానికి లబ్ధిదారులు తప్పకుండా కొన్ని పనులు పూర్తి చేయాలి. అవి

* ఈ-కేవైసి పూర్తి చేసి ఉండాలి: మీరు మీ ఈ-కేవైసిని తప్పనిసరిగా పూర్తి చేయాలి.

* బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్: మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం అయి ఉండాలి.

* బ్యాంక్ ఖాతా వివరాలు సరైనవా కావా?: మీ బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.

* భూ రికార్డుల సమస్యల పరిష్కారం: మీ భూ రికార్డులలో ఏమైనా సమస్యలు ఉంటే, వాటిని సరిచేసి ఉండాలి.

* బెనిఫిషియరీ స్టేటస్ తనిఖీ: పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ బెనిఫిషియరీ స్టేటస్ ను తప్పకుండా చెక్ చేసుకోండి.

* మొబైల్ నంబర్ అప్‌డేట్: మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే పథకానికి సంబంధించిన సమాచారం మీకు వస్తుంది.

పీఎం కిసాన్ పథకం వెబ్‌సైట్ చిరునామా: pmkisan.gov.in/

ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, హోమ్ పేజీలో కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే కనిపించే Farmers Corner సెక్షన్‌లో Beneficiary List ను క్లిక్ చేసి, మీ గ్రామంలోని పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల పూర్తి జాబితాను చూడవచ్చు. ఇ-కేవైసి చేసే అవకాశం, మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసే అవకాశం కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story