ఇండియా ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సదస్సులో సీయం చంద్రబాబునాయుడు

విశాఖపట్నంలో పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన ఇండియా ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సదస్సుకు సీయం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీయం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఫుడ్‌ ప్రోసెసింగ్‌, వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా తదిరత రంగాల్లో అపారమైన అవకాశాలు చాటి చెప్పేలా టీపీసీఐ సదస్సును నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార శుద్ధి పరిశ్రమ విలువ 8 ట్రిలియన్‌ డాలర్లు ఉందని సీయం చెప్పారు. 2030 నాటికి 700 బిలియన్‌ డాలర్లకు దేశంలోని ఆహారశుద్ధి పరిశ్రమ చేరుతుందని కేంద్రం అంచనా వేస్తోందని సీయం చంద్రబాబు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఏపీ 9% వాటాతో 50 బిలియన్ల డాలర్ల విలువను కలిగి ఉందననారు. జీఎస్డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల జీవీఏ రూ. 5.19 లక్షల కోట్ల మేర ఉండగా ఏపీ జీఎస్డీపీలో 35 శాతం మేర వాటాను వ్యవసాయం అనుబంధ రంగాలు కలిగి ఉన్నాయని సీయం తెలిపారు. ఏపీ ప్రస్తుతం ఫ్రూట్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంది. త్వరలోనే మొత్తం ఉత్పత్తిలో 25 శాతానికి చేరుకుంటామని సీయం ధీమా వ్యక్తం చేశారు. 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వా కల్చర్ చేస్తున్న ఏపీ దేశానికే ఆక్వా హబ్ గా ఉందన్నారు. పట్టణీకరణ, జీవనశైలి, తలసరి ఆదాయాలు కొత్త అవకాశాలకు దారితీస్తున్నాయి ప్రస్తుతం ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అందిపుచ్చుకోవాలన్నారు.

ఏపీలోని చిత్తూరు, గుంటూరు, కోస్తాంధ్ర జిల్లాలు, విశాఖలలో పండ్లు, మసాలా దినుసులు, ఆక్వా, కోకో, కాఫీ లాంటి క్లస్టర్లు ఉన్నాయని చెప్పారు. ఏపీలో అంతర్జాతీయస్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకో సిస్టం ఉందని 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్, 33 లక్షల టన్నుల గోదాముల సామర్ధ్యం ఏపీలో ఉందన్నారు. 175 నియోజక వర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఇప్పుడు ప్యాకేజింగ్ అనేది ఇప్పుడు ప్రధాన సవాలుగా ఉంది. దీనిపై కూడా ఏపీ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలిస్తున్నామని రూ. 200 కోట్ల పెట్టుబడులు దాటితే మెగా ప్రాజెక్టుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని సీయం ప్రకటించారు. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో గతేడాదిగా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పెట్టుబడులకు ఇదే మంచి సమయం, ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు ఇచ్చేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని సీయం చెప్పారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని సీయం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story