Google-Jio Partnership : గూగుల్-జియో ఒప్పందం.. 18 నెలల పాటు రూ.35,100 ఫ్రీ ఏఐ సర్వీస్
18 నెలల పాటు రూ.35,100 ఫ్రీ ఏఐ సర్వీస్

Google-Jio Partnership : పెర్ప్లెక్సిటీ AIతో ఎయిర్‌టెల్ భాగస్వామ్యం కుదుర్చుకున్న మాదిరిగానే, రిలయన్స్ జియో సంస్థ గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. తన కస్టమర్లకు గూగుల్ AI ప్రో సర్వీసును ఉచితంగా అందించనుంది. 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల జియో వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లను కొనుగోలు చేస్తే 18 నెలల పాటు ఉచితంగా AI ప్రోని ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈ గూగుల్ AI ప్రో ప్యాకేజీలో జెమిని 2.5 ప్రో, వియో 3.1 వీడియో జనరేషన్, ఇమేజన్ 3 ఇమేజ్ క్రియేషన్, నోట్‌బుక్ ఎల్‌ఎమ్, 2TB క్లౌడ్ స్టోరేజ్ అన్నీ ఉంటాయి. వీటి మొత్తం మార్కెట్ విలువ రూ.35,100 గా అంచనా. ఇవన్నీ జియో వినియోగదారులకు ఒకటిన్నర సంవత్సరాల పాటు ఉచితంగా లభిస్తాయి.
ప్రస్తుతం ఈ ప్లాన్‌ను యువ వినియోగదారులకు మాత్రమే అందించాలని నిర్ణయించారు. అంటే 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల వినియోగదారులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. రాబోయే రోజుల్లో అన్ని జియో వినియోగదారుల 5G ప్లాన్‌లలో ఈ ఆఫర్ చేర్చబడుతుంది. జియో వినియోగదారులు మై జియో యాప్‌లోకి వెళ్లి అక్కడి నుండి ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
గూగుల్ AI ప్యాకేజీలో అందించిన అన్ని ఆఫర్‌లు కూడా తిరస్కరించలేనివి. గూగుల్ 2.5 ప్రో మోడల్ హై లెవల్ AI మోడల్. నానో బనానా మోడల్ నుంచి మీకు కావలసిన ఇమేజ్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావలసిన విధంగా ఇమేజ్‌లను ఎడిట్ చేయవచ్చు. ఈ నానో బనానా ఇప్పుడు చాలా పాపులారిటీ పొందింది. వియో 3.1 మోడల్ నుండి మంచి వీడియోలను క్రియేట్ చేయవచ్చు.
నోట్‌బుక్ ఎల్‌ఎమ్ మోడల్‌ను రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కోసం బాగా ఉపయోగించవచ్చు. వీటితో పాటు మీ వాట్సాప్, కెమెరా ఫోటోలను బ్యాకప్ చేసుకోవడానికి 2TB క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు.








