Unclaimed Shares : ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న షేర్లు, డివిడెండ్లను అసలైన ఇన్వెస్టర్లకు లేదా వారి వారసులకు సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక డిజిటల్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న సమయం తీసుకునే, కాగితాల తో కూడిన ప్రక్రియకు స్వస్తి పలికి పూర్తిగా డిజిటలైజ్డ్, సమ్మతి ఆధారిత, పేపర్‌లెస్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త విధానంతో క్లెయిమ్ ప్రక్రియ మునుపటి కంటే చాలా వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఏఐ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీల అనుసంధానం

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (IEPFA) ఈ క్లెయిమ్‌ల పర్యవేక్షణను చూస్తుంది. కొత్తగా రూపొందిస్తున్న ప్లాట్‌ఫామ్ ద్వారా MCA21 పోర్టల్, డిపాజిటరీలు, రిజిస్ట్రార్లు, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు, బ్యాంకులు, డిజిలాకర్, అథెంటికేషన్ ప్లాట్‌ఫామ్‌లను అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) టెక్నాలజీతో అనుసంధానించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ సహాయంతో డేటా వెరిఫికేషన్ ప్రక్రియను ఆటోమేటిక్గా పూర్తి చేయనున్నారు.

పత్రాలు మళ్లీ మళ్లీ ఇవ్వాల్సిన పనిలేదు

సాధారణంగా ఏదైనా కంపెనీలో ఏడేళ్ల పాటు క్లెయిమ్ చేయని షేర్లు, డివిడెండ్లు, మెచ్యూర్ అయిన డిబెంచర్లను కంపెనీలు ఐఈపీఎఫ్ఏకు బదిలీ చేస్తాయి. ప్రస్తుతం ఉన్న విధానంలో ఇన్వెస్టర్లు రకరకాల సంస్థల చుట్టూ తిరుగుతూ, ఒకే పత్రాన్ని పదేపదే సమర్పించాల్సి వస్తోంది. కానీ నూతన పోర్టల్‌లో వినియోగదారుడి అనుమతితో ప్రభుత్వ అధికారిక సోర్సెస్ నుంచి డేటాను నేరుగా వెరిఫై చేస్తారు. దీనివల్ల ఇన్వెస్టర్లు ప్రతిసారీ పత్రాలను మళ్లీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు.

సింగిల్ విండో సిస్టమ్‌తో క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం

ఈ కొత్త పోర్టల్ ఒకే ఒక సింగిల్ ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తుంది. అప్లికేషన్ సబ్మిషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్టేటస్ ట్రాకింగ్, లోపాల సవరణ, పేమెంట్ క్లియరెన్స్ వంటి అన్ని పనులు ఒకే చోట పూర్తవుతాయి. తక్కువ మొత్తం లేదా సులువైన క్లెయిమ్‌లను త్వరితగతిన పూర్తి చేసి, సంక్లిష్టమైన లేదా రిస్క్ ఎక్కువగా ఉన్న కేసులను విస్తృతంగా పరిశీలించేలా ఏఐ ఆధారిత ఫ్రాడ్ ప్రివెన్షన్ సిస్టమ్‌ను ఇందులో పొందుపరుస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story