రూ. 50 లక్షల లోన్‌పై రూ. 18 లక్షల వరకు ఆదా

Home Loan Hack : మీరు కూడా హోమ్ లోన్ EMI లు కట్టి కట్టి అలిసిపోయి, ఈ భారం ఎప్పుడు తగ్గుతుందని ఎదురుచూస్తున్నారా? అయితే మీకోసం ఒక మంచి శుభవార్త ఉంది. చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ ఒక అద్భుతమైన ట్రిక్‌ను వెల్లడించారు. దీని ద్వారా రూ.50-60 లక్షల హోమ్ లోన్‌పై మీరు ఏకంగా రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు భారీగా ఆదా చేసుకోవచ్చు. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రిక్ కష్టమైనది కాదు, దీని కోసం మీరు అదనపు ఆదాయం సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం EMI చెల్లించే విధానంలో ఒక చిన్న మార్పు చేసుకుంటే చాలు, ఏళ్ల తరబడి కట్టాల్సిన వడ్డీ భారం తగ్గి, మీ లోన్ త్వరగా పూర్తవుతుంది.

హోమ్ లోన్ అతి పెద్ద సమస్య, దాని సుదీర్ఘ కాలపరిమితి (20-30 సంవత్సరాలు), భారీ వడ్డీ భారం. మీరు తీసుకున్న అసలు మొత్తం (ఉదాహరణకు 50 లక్షలు) కంటే, బ్యాంకుకు తిరిగి చెల్లించే మొత్తం దాదాపు రెట్టింపు (కోటి వరకు) అవుతుంది. అందుకే చాలా మంది తమ జీవితంలో కష్టపడి సంపాదించిన డబ్బులో పెద్ద భాగాన్ని వడ్డీ రూపంలోనే బ్యాంకుకు కట్టేస్తారు. కానీ కొంచెం తెలివిగా ప్లాన్ చేస్తే, వడ్డీ భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

సీఏ నితిన్ కౌశిక్ సూచించిన చిట్కా చాలా సులభం..చాలా మంది నెలకు ఒకసారి (నెలకు ఒక ఫుల్ EMI) చొప్పున, అంటే సంవత్సరానికి మొత్తం 12 EMI లు చెల్లిస్తారు. ఈ పద్ధతికి బదులుగా, మీ EMI మొత్తాన్ని రెండు సమాన భాగాలుగా విభజించి, ప్రతి 15 రోజులకు ఒకసారి (అంటే బై-మంత్లీ) సగం EMI ని చెల్లించండి.

ఈ విధంగా చేయడం వల్ల ఒక చిన్న లెక్క మారుతుంది. మీరు ప్రతి 15 రోజులకు సగం EMI చెల్లిస్తే, సంవత్సరంలో మొత్తం 26 హాఫ్-EMI లు చెల్లిస్తారు. ఇది మొత్తం 13 పూర్తి EMI లకు సమానం అవుతుంది. అంటే, మీకు తెలియకుండానే ప్రతి సంవత్సరం ఒక అదనపు EMI ని బ్యాంకుకు కట్టేస్తున్నారు. ఈ అదనపు EMI మొత్తం నేరుగా మీ అసలులో జమ అవుతుంది. దీంతో మీ లోన్ బ్యాలెన్స్ త్వరగా తగ్గుతుంది, వడ్డీ కూడా వేగంగా తగ్గడం మొదలవుతుంది.

ఎంత ఆదా అవుతుంది? (లెక్క)

మీ హోమ్ లోన్ రూ.50-60 లక్షలు ఉండి, వడ్డీ రేటు 8-9% మధ్య ఉంటే ఈ ట్రిక్‌ను ఉపయోగించడం వల్ల మీ లోన్ 6-7 సంవత్సరాల ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు సుమారు రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వడ్డీని ఆదా చేసుకోవచ్చు. దీని వలన EMI భారం త్వరగా తీరడమే కాకుండా, మీ జీవితంలో లక్షల రూపాయల పొదుపు కూడా అవుతుంది.

ఈ ట్రిక్‌ను అమలు చేయడానికి ముందు, మీరు మీ బ్యాంక్ పాలసీని తప్పకుండా తనిఖీ చేయాలి. ఎందుకంటే అన్ని బ్యాంకులు ప్రతి 15 రోజులకు (బై-మంత్లీ) పేమెంట్ తీసుకునే సౌకర్యాన్ని ఇవ్వకపోవచ్చు. మీ బ్యాంక్ బై-మంత్లీ లేదా పార్ట్-పేమెంట్ (కొంత అదనపు డబ్బు చెల్లించడం) సౌకర్యాన్ని అందిస్తే, ఈ పద్ధతి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story