దేశంలో ఏ బ్యాంకు అతి తక్కువ వడ్డీ ఇస్తోందో తెలుసా?

Home Loan Rates : సొంత ఇల్లు కొనాలనేది చాలా మంది జీవిత లక్ష్యం. అయితే ముఖ్యంగా టైర్-1, టైర్-2 నగరాల్లో ఇళ్ల ధరలు కోట్లలోకి చేరడంతో సాధారణ ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చుకోవడం కష్టంగా మారింది. అందుకే చాలా మంది ఇల్లు కొనుగోలు చేయడానికి బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకుంటున్నారు. మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, దేశంలోని ప్రధాన బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల గురించి తప్పక తెలుసుకోవాలి. సరైన బ్యాంక్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవచ్చు..అత్యంత చౌకైన లోన్‌ను ఎంచుకోవచ్చు.

హోమ్ లోన్ ఎంచుకునేటప్పుడు కేవలం బ్యాంకు పేరు మాత్రమే కాదు, వడ్డీ రేటు, మీ ఆర్థిక ప్రొఫైల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీరు ఎంత తక్కువ వడ్డీ చెల్లించాలనేది మీ క్రెడిట్ స్కోర్ పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే, వడ్డీ రేటు అంత తక్కువగా ఉంటుంది. అన్ని బ్యాంకుల్లోని వడ్డీ రేట్లను పోల్చి చూసిన తర్వాతే లోన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆర్థిక నష్టం నుంచి తప్పించుకోవచ్చు.

దేశంలో అతి తక్కువ వడ్డీ రేట్లు అందించే బ్యాంకుల్లో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన SBI లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.50 శాతం నుంచి ప్రారంభమవుతాయి. కస్టమర్ ప్రొఫైల్, క్రెడిట్ స్కోర్‌ను బట్టి ఈ రేటు 10.75 శాతం వరకు పెరగవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా తన వినియోగదారులకు 7.35 శాతం వడ్డీ రేటు నుంచి హోమ్ లోన్ అందిస్తోంది. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్,ఇతర షరతుల ఆధారంగా ఈ రేటు మారుతుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేట్లు 7.35 శాతం నుంచి ప్రారంభమై 12.15 శాతం వరకు ఉంటాయి. వడ్డీ రేట్లు కస్టమర్ ఆదాయం, క్రెడిట్ స్కోర్, ప్రొఫైల్ ఆధారంగా మారుతాయి. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే, ప్రైవేట్ బ్యాంకుల వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ప్రారంభమవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన HDFC, 7.90 శాతం నుంచి 13.20 శాతం వరకు వడ్డీ రేట్లపై హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు అయిన ICICI బ్యాంక్, తన వినియోగదారులకు 8.75 శాతం నుంచి 11.80 శాతం మధ్య వడ్డీ రేట్లతో హోమ్ లోన్ అందిస్తోంది.

నోట్ : ఈ వడ్డీ రేట్లు బ్యాంకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, కస్టమర్ వ్యక్తిగత క్రెడిట్ రిస్క్ ఆధారంగా ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story