Deepika Padukone :దీపికా పదుకొణె ఎంత సంపాదిస్తారు.. హాలీవుడ్ స్టార్ మెయింటెనెన్స్ కోసం ఆమె ఎంత ఖర్చు చేస్తారు?
హాలీవుడ్ స్టార్ మెయింటెనెన్స్ కోసం ఆమె ఎంత ఖర్చు చేస్తారు?

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద స్టార్ అయ్యారు. ఆమెకు రీసెంటుగా అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్‌లో ఉండే 'వాక్ ఆఫ్ ఫేమ్'లో ఆమె పేరు వచ్చింది. ఇది ఇండస్ట్రీలోని ఏ నటుడికైనా చాలా గొప్ప విషయం. అయితే, ఈ స్టార్‌ను అలా ఉంచడానికి దీపికా ప్రతి సంవత్సరం దాదాపు రూ.73 లక్షలు ఖర్చు చేస్తుందట. మరి ఇంతకు దీపికాకు ఎంత సంపాదన ఉందో తెలుసా.
హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అనేది అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఒక రోడ్డు. ఈ రోడ్డుపై స్టార్ ఆకారంలో కొన్ని పలకలు ఉంటాయి. వాటిపై ప్రపంచంలోని పెద్ద పెద్ద నటుల పేర్లు రాసి ఉంటాయి. సినిమా, టీవీ, పాటలు లాంటి రంగాల్లో బాగా కష్టపడిన వారికి ఈ గుర్తింపు ఇస్తారు. ఇప్పుడు ఈ రోడ్డుపై దీపికా పేరు కూడా చేరబోతోంది. దీపికా పదుకొణె కేవలం బాలీవుడ్‌లో మాత్రమే కాదు, హాలీవుడ్‌లో కూడా సినిమాలు చేశారు. 'xXx: Return of Xander Cage' అనే ఇంగ్లీష్ సినిమాలో నటించారు. అలాగే, పెద్ద పెద్ద అంతర్జాతీయ ఈవెంట్లకు వెళ్లారు. ఇవన్నీ ఆమెను ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్టార్‌గా మార్చాయి. అందుకే, ఆమెకు ఈ వాక్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కింది. ఈ గౌరవం పొందిన తొలి భారతీయ నటి దీపికానే.
హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో స్టార్ వచ్చిన తర్వాత, ఆ స్టార్‌ను శుభ్రం చేయడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి, భద్రత కల్పించడానికి ప్రతి సంవత్సరం కొంత డబ్బు కట్టాలి. దీనినే 'మెయింటెనెన్స్' అంటారు. దీపికా పదుకొణె ఈ స్టార్ కోసం ఏటా దాదాపు 88,000 డాలర్లు అంటే సుమారు రూ.73 లక్షలు ఖర్చు చేస్తారు. ఈ డబ్బును ఆమెను నామినేట్ చేసిన వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయగలిగే దీపికా సంపాదన కూడా చాలా ఎక్కువే. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.500 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని మీడియా వర్గాల సమాచారం. ఆమె సినిమాలతో పాటు, చాలా బ్రాండ్లకు ప్రచారం చేస్తారు. తన సొంత బ్రాండ్‌లు కూడా ఉన్నాయి. ఇంకా సినిమా ప్రొడక్షన్ హౌస్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు.
