Gold Deposits In Odisha : ఒడిషా రాష్ట్రలో భారీ బంగారు నిక్షేపాలు
ఒడిషాలోని నాలుగు జిల్లాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు జీఎస్‌ఐ వెల్లడి

ఒడిషా రాష్ట్రం ఒక జాక్‌పాట్ కొట్టింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడయ్యింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిషా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు కనుగొంది. ప్రాథమిక అంచనాల ప్రకారం 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నాణ్యమైన బంగారు నిల్వలు ఉన్నట్లు జీఎస్‌ఐ చెపుతోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఓడిషాలోని నాలుగు జిల్లాల్లో గణనీయమైన బంగారు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించినట్లు చెపుతోంది. దేవ్‌ఘర్, కియోంఘర్, సుందర్‌ఘర్, నబరంగ్‌పూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు జీఎస్‌ఐ తెలిపింది. ఈ మధ్యకాలంలో ఇంతటి భారీ స్ధాయిలో బంగారు నిల్వలు బయటపడటం ఇదే మొదటి సారి. భారత మైనింగ్ వ్యవహారాలకు సంబంధించి ఇదొక సంచలన విషయమనే చెప్పాలి.
