వడ్డీతో డబ్బులు వస్తాయి

IT Refund Delay : ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 16 ముగిసింది. చాలామంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే తమ ఐటీఆర్‌లను ఫైల్ చేశారు. అయితే, కొంతమందికి ఇంకా రీఫండ్ డబ్బులు రాలేదని ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా చిన్న మొత్తాల రీఫండ్స్ కొన్ని రోజుల్లోనే బ్యాంక్ అకౌంట్‌లలో జమ అవుతాయి. కానీ, పెద్ద మొత్తంలో రీఫండ్స్ కావాలంటే కొంత సమయం పడుతుంది.

రీఫండ్ ఆలస్యానికి కారణాలు

ఆదాయపు పన్ను రీఫండ్ రావడానికి సగటున నాలుగు నుంచి ఐదు వారాలు పట్టవచ్చు. దీనికి ప్రధాన కారణం, ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 143(1) కింద వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం డిడక్షన్స్, ఎగ్జెంప్షన్స్‌కు కొత్త వెరిఫికేషన్ పద్ధతులు ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో రీఫండ్ క్లెయిమ్ చేస్తే, వెరిఫికేషన్ మరింత కఠినంగా ఉంటుంది.

క్యాపిటల్ గెయిన్, వ్యాపారం వంటి ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తే, ఆదాయపు పన్ను శాఖ మరింత జాగ్రత్తగా పరిశీలిస్తుంది. మీరు క్లెయిమ్ చేసిన రీఫండ్, మీ పన్ను బాధ్యత సరిపోలకపోతే, అధికారులు మీ నుంచి మరింత సమాచారం కోరవచ్చు. ఇలాంటి సందర్భాల్లో రీఫండ్ రావడానికి ఒక నెల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.

ఆలస్యమైతే లాభమే!

ఒకవేళ మీ రీఫండ్ ఆలస్యంగా వస్తే మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ మీకు ఆలస్యమైన రీఫండ్‌పై బడ్డీని కూడా కలిపి ఇస్తుంది. మీరు రీఫండ్ కోసం క్లెయిమ్ చేసిన డబ్బుకు వార్షికంగా 6% వడ్డీని ఆదాయపు పన్ను శాఖ చెల్లిస్తుంది.

ఈ వడ్డీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి లెక్కించబడుతుంది. ఉదాహరణకు, మీకు అక్టోబర్‌లో రీఫండ్ వస్తే, ఆరు నెలల వడ్డీ జమ అవుతుంది. ఒకవేళ నవంబర్‌లో వస్తే, ఏడు నెలల వడ్డీ మీ డబ్బుకు కలిసి వస్తుంది. కాబట్టి, రీఫండ్ రావడంలో ఆలస్యం అయితే, అది మీకు ఒకరకంగా లాభమే అని చెప్పవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story