India-US Trade Deal : భారత్-అమెరికా మెగా డీల్ పై భారీ అప్‌డేట్.. మార్చిలోనే సంతకాలు? కేంద్రం కీలక ప్రకటన
మార్చిలోనే సంతకాలు? కేంద్రం కీలక ప్రకటన

India-US Trade Deal : భారతదేశం, అగ్రరాజ్యం అమెరికా మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య చర్చల పర్వం ముగిసి, ఇప్పుడు వ్యవహారం అంతా సంతకాలు, కాగితాల వరకు వచ్చేసింది. అంతా అనుకున్నట్లు జరిగితే, వచ్చే నెల అంటే మార్చి 2026 లో ఈ మెగా డీల్ పై ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సంకేతాలిచ్చింది. సోమవారం నాడు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయమై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక రూపురేఖలు ఇప్పటికే సిద్ధమయ్యాయని, దీనిని చట్టబద్ధం చేసే ప్రక్రియలో భాగంగా భారత అధికారుల బృందం వచ్చే వారం అమెరికా వెళ్లనుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ వాణిజ్య ఒప్పందాన్ని కొలిక్కి తెచ్చేందుకు భారత్ ఇప్పుడు పూర్తి స్థాయిలో వేగం పెంచింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమెరికాలో పర్యటించనుంది. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం ఒప్పందానికి సంబంధించిన లీగల్ టెక్స్ట్ ను ఖరారు చేయడం. వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ దర్పణ్ జైన్ ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించనున్నారు. వాషింగ్టన్‌లో వారు అమెరికా అధికారులతో భేటీ అయ్యి, ఒప్పందంలోని ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా వర్చువల్ చర్చలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి, ఇప్పుడు జరిగే ఈ ప్రత్యక్ష సమావేశం ఆ చర్చలకు ఒక ముగింపు పలకనుంది.
నిజానికి ఈ నెల ప్రారంభంలోనే భారత్, అమెరికా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇందులో ఒక ఇన్టర్న్ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం అవసరమైన ఫ్రేమ్‌వర్క్ లేదా పునాది సిద్ధమైందని ప్రకటించారు. దీని గురించి రాజేష్ అగర్వాల్ చాలా సరళంగా వివరించారు. "ఒక ఇంటికి ప్లాన్ ఎలాగైతే సిద్ధమవుతుందో, అలాగే ఈ డీల్ కి సంబంధించి ఇరు దేశాల ఆశయాలను సంయుక్త ప్రకటన రూపంలో సిద్ధం చేశాం. ఇప్పుడు ఆ ప్లాన్ ని ఒక చట్టపరమైన పత్రంగా మార్చడమే మా ముందున్న సవాలు. అప్పుడే ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేయగలవు" అని ఆయన పేర్కొన్నారు. అంటే చర్చలన్నీ ఫలప్రదమయ్యాయి, ఇప్పుడు కేవలం వాటిని కాగితాల మీద పెట్టడమే మిగిలి ఉందన్నమాట.
మరి ఈ డీల్ ఎప్పుడు పక్కా అవుతుంది? అనే దానిపై ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నా, కాస్త జాగ్రత్తగా స్పందిస్తోంది. వచ్చే మార్చి నెలలోగా ఈ ఒప్పందాన్ని క్లోజ్ చేసి, సంతకాలు పూర్తి చేయాలని భారత్, అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, దీని కోసం ప్రభుత్వం ఎలాంటి గడువును విధించుకోలేదు. చట్టపరమైన ఒప్పందాలను రూపొందించేటప్పుడు చాలా సాంకేతిక అంశాలు, సంక్లిష్టతలు ఉంటాయని, వాటిని ఇరు పక్షాలు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని కార్యదర్శి తెలిపారు. ఒకవేళ వాషింగ్టన్ పర్యటనలో అన్ని లీగల్ చిక్కులు తొలగిపోతే మార్చిలోనే శుభవార్త వినవచ్చు, లేదంటే ఈ ప్రక్రియ మరికొంత కాలం ముందుకు సాగే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రాధాన్యత మాత్రం మార్చి నెలకే ఇస్తున్నట్లు సమాచారం.India-US Trade Deal : భారతదేశం, అగ్రరాజ్యం అమెరికా మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య చర్చల పర్వం ముగిసి, ఇప్పుడు వ్యవహారం అంతా సంతకాలు, కాగితాల వరకు వచ్చేసింది. అంతా అనుకున్నట్లు జరిగితే, వచ్చే నెల అంటే మార్చి 2026 లో ఈ మెగా డీల్ పై ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సంకేతాలిచ్చింది. సోమవారం నాడు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయమై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక రూపురేఖలు ఇప్పటికే సిద్ధమయ్యాయని, దీనిని చట్టబద్ధం చేసే ప్రక్రియలో భాగంగా భారత అధికారుల బృందం వచ్చే వారం అమెరికా వెళ్లనుందని ఆయన స్పష్టం చేశారు.

మరి ఈ డీల్ ఎప్పుడు పక్కా అవుతుంది? అనే దానిపై ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నా, కాస్త జాగ్రత్తగా స్పందిస్తోంది. వచ్చే మార్చి నెలలోగా ఈ ఒప్పందాన్ని క్లోజ్ చేసి, సంతకాలు పూర్తి చేయాలని భారత్, అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, దీని కోసం ప్రభుత్వం ఎలాంటి గడువును విధించుకోలేదు. చట్టపరమైన ఒప్పందాలను రూపొందించేటప్పుడు చాలా సాంకేతిక అంశాలు, సంక్లిష్టతలు ఉంటాయని, వాటిని ఇరు పక్షాలు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని కార్యదర్శి తెలిపారు. ఒకవేళ వాషింగ్టన్ పర్యటనలో అన్ని లీగల్ చిక్కులు తొలగిపోతే మార్చిలోనే శుభవార్త వినవచ్చు, లేదంటే ఈ ప్రక్రియ మరికొంత కాలం ముందుకు సాగే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రాధాన్యత మాత్రం మార్చి నెలకే ఇస్తున్నట్లు సమాచారం.