మేక్ ఇన్ ఇండియా 2.0కి రెడీ

Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 ముంగిట భారత్ తన వాణిజ్య వ్యూహాన్ని సమూలంగా మార్చుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అమెరికా విధిస్తున్న కొత్త టారిఫ్ పన్నులు, చైనా-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతోంది. కేవలం ఒక దేశంపై ఆధారపడకుండా, తన ఎగుమతులను ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. 2025లో గ్లోబల్ ట్రేడ్ గ్రోత్ కేవలం 0.5 శాతానికి పడిపోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇలాంటి గడ్డు కాలంలో భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంది. బ్రిటన్‎తో కుదుర్చుకున్న సంచలన ఒప్పందం, న్యూజిలాండ్, ఒమన్‌తో కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు భారత్‌కు కొత్త మార్కెట్లను తెరిచాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ ఒప్పందం ద్వారా మన ఎగుమతులకు 100% పన్ను మినహాయింపు దక్కడం ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పవచ్చు.

దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన పీఎల్ఐ స్కీమ్స్ అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాగా, మొబైల్ ఫోన్లు, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది. బడ్జెట్ 2026లో ఈ స్కీమ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి కొత్త రంగాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. దీనివల్ల మన దేశం గ్లోబల్ సప్లై చైన్‌లో ఒక నమ్మకమైన భాగస్వామిగా మారుతుంది.

వస్తువుల ఎగుమతులు మందగించినా, డిజిటల్ సేవల ఎగుమతులు భారత్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో సేవల ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల మార్కును దాటే అవకాశం ఉంది. బడ్జెట్ 2026లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్‌మెంట్, లాజిస్టిక్స్ పై ప్రభుత్వం మరింత పెట్టుబడి పెట్టనుంది. తద్వారా వియత్నాం, థాయిలాండ్, సౌదీ అరేబియా వంటి దేశాలకు మన సేవలను మరింతగా విస్తరించవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story