ఇక నుంచి వారంలో 4 రోజులే పని..3 రోజులు సెలవు

New Labour Code : భారత ప్రభుత్వం అమలులోకి తేబోతున్న కొత్త లేబర్ కోడ్స్ ఉద్యోగులకు పని వేళల్లో పూర్తి సౌలభ్యా కల్పించబోతోంది. కొన్ని దేశాల్లో ఉన్నట్లుగా భారత ఉద్యోగులు కూడా ఇకపై వారంలో మూడు రోజులు సెలవు తీసుకునే అవకాశం లభించింది. అయితే ఇక్కడ ప్రధాన షరతు ఏమిటంటే, ఒక కార్మికుడు వారంలో తప్పనిసరిగా 48 గంటలు మాత్రమే పని చేయాలి. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ కొత్త చట్టం రోజువారీ పని గంటలపై ఎటువంటి పరిమితి విధించలేదు.

కొత్త లేబర్ కోడ్ ప్రకారం.. వారానికి 48 గంటల పని పరిమితిని కంపెనీలు ఎలా అమలు చేస్తాయనే దానిపై ఉద్యోగులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవచ్చు. ఒక ఉద్యోగి రోజుకు 12 గంటలు చొప్పున నాలుగు రోజులు పని చేస్తే, వారంలో మొత్తం 48 గంటలు పూర్తవుతుంది. అప్పుడు మిగిలిన మూడు రోజులు (శుక్రవారం, శనివారం, ఆదివారం) పెయిడ్ హాలిడేలుగా తీసుకోవచ్చు. ఊరికి వెళ్లాలనుకునే వారికి, వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ఒకవేళ రోజుకు 8 గంటలు మాత్రమే పని చేయగలిగితే, వారానికి ఆరు రోజులు పని చేయాల్సి ఉంటుంది. కేవలం ఒక రోజు మాత్రమే వీక్‌ఆఫ్ లభిస్తుంది. రోజుకు 10 గంటలు పని చేస్తే, వారానికి రెండు రోజులు సెలవు తీసుకోవచ్చు.

వారానికి 48 గంటల కంటే ఎక్కువ పని చేయవలసిన అవసరం కంపెనీకి వస్తే, కొత్త లేబర్ కోడ్ ప్రకారం, కంపెనీలు ఉద్యోగులకు తప్పనిసరిగా ఓవర్ టైమ్ చెల్లించాలి. ఓవర్ టైమ్‌గా పని చేసే ప్రతి గంటకు, సాధారణ వేతనం కంటే రెట్టింపు వేతనం ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే వారంలో 3 రోజులు సెలవు తీసుకోవడం లేదా పని గంటలను నిర్ణయించడం వంటి నిర్ణయాలు ఉద్యోగి స్వతంత్రంగా తీసుకోలేరు. రోజుకు 12 గంటలు పని చేయాలా, లేక 8 గంటలు పని చేయాలా అనే విషయాన్ని ఉద్యోగులతో చర్చించిన తర్వాత, సంస్థల యాజమాన్యం తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story