ఎల్‌ఐసీ కొత్త ప్లాన్ అదిరింది!

LIC : భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రజల ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా అనేక పాలసీలను అందిస్తోంది. వాటిలో ఒకటి ప్రత్యేకమైన 'జీవన్ ఉత్సవ్' పాలసీ. ఈ పాలసీ అతి తక్కువ కాలం ప్రీమియం చెల్లించి, జీవితాంతం సురక్షితమైన ఆదాయం పొందే అవకాశం ఇస్తుంది. ఈ పాలసీ మార్కెట్‌తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. అంటే, మార్కెట్ హెచ్చుతగ్గులు దీనిపై ఎలాంటి ప్రభావం చూపవు. పాలసీ తీసుకునేటప్పుడే, ఎంత హామీ మొత్తం లభిస్తుందో స్పష్టంగా తెలుస్తుంది.

జీవన్ ఉత్సవ్ పాలసీ వివరాలు

ఈ పాలసీని 90 రోజుల పసిపిల్లల నుండి 65 సంవత్సరాల వయస్సు వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో కనీస హామీ మొత్తం రూ. 5 లక్షలు. ఈ మొత్తాన్ని మీరు పెంచుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు కాలం కనిష్ఠంగా 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 16 సంవత్సరాలు ఉంటుంది. అంటే, మీరు మీ వీలును బట్టి 5 నుండి 16 సంవత్సరాల వరకు ప్రీమియం కట్టవచ్చు.

ఎంత పెట్టుబడి, ఎంత ఆదాయం?

ఉదాహరణకు, మీరు రూ. 5 లక్షల కనీస హామీ మొత్తాన్ని ఎంచుకుని, ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లించాలని నిర్ణయించుకుంటే, మీరు సంవత్సరానికి రూ. 1.16 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఐదేళ్లలో మీరు మొత్తం రూ. 5.80 లక్షలు పెట్టుబడి పెడతారు.

ప్రీమియం చెల్లింపు పూర్తయిన తర్వాత ఐదేళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఐదేళ్ల తర్వాత మీకు ప్రతి సంవత్సరం రూ. 50,000 ఆదాయం లభిస్తుంది. ఇది మీకు జీవితాంతం వస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే, నామినీకి రూ. 5 లక్షల బీమా మొత్తం లభిస్తుంది.

మీకు ప్రతి సంవత్సరం ఎక్కువ ఆదాయం కావాలంటే.. మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు, సంవత్సరానికి రూ. 5 లక్షల ఆదాయం కావాలంటే రూ. 50 లక్షల హామీ మొత్తాన్ని ఎంచుకోవాలి. అప్పుడు మీరు సంవత్సరానికి దాదాపు రూ. 11 లక్షలు చొప్పున ఐదేళ్లు ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీ తక్కువ కాలం ప్రీమియం చెల్లించి ఎక్కువ కాలం ఆర్థిక భద్రత కోరుకునే వారికి మంచి ఎంపిక.

PolitEnt Media

PolitEnt Media

Next Story