రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత సంచలన హెచ్చరిక

Economic Crisis : ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అంతర్జాతీయ పెట్టుబడిదారులను హెచ్చరించారు. ఈ సంవత్సరం ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీ ఆర్థిక సంక్షోభం రాబోతోందని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా, వృద్ధులు, రిటైర్ అయిన వ్యక్తుల పొదుపు మొత్తాన్ని ఈ సంక్షోభం పూర్తిగా తుడిచిపెట్టేస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

రిటైర్మెంట్ సేవింగ్స్‌కు ముప్పు

రక్షణ కవచంగా భావించే రిటైర్మెంట్ సేవింగ్స్‌కే ప్రమాదం ఉందని కియోసాకి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' ద్వారా తెలిపారు. బేబీ బూమర్స్ రిటైర్మెంట్ మొత్తాలు అంతమవుతాయని, చాలా మంది ఇళ్లు కోల్పోయి, తమ పిల్లల ఇళ్లలో ఉండాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తాను గతంలో రాసిన రిచ్ డాడ్స్ ప్రొఫెసీ అనే పుస్తకంలోనే ఈ భారీ సంక్షోభాన్ని ముందే ఊహించానని, అది ఈ ఏడాదిలోనే కళ్ల ముందు కనిపిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

డబ్బు దాచుకునేవారు నష్టపోతారు - కారణం ఇదే!

రొట్టె ముక్కలాంటి ఫియట్ కరెన్సీ అంటే ప్రభుత్వం ముద్రించే డబ్బును కియోసాకి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆయన సిద్ధాంతం ప్రకారం "Savers are Losers" అంటే, కేవలం డబ్బు దాచుకునే వ్యక్తులు వాస్తవానికి నష్టపోతారు. ఎందుకంటే ద్రవ్యోల్బణం క్రమంగా వారి పొదుపు విలువను తగ్గిస్తుంది. అందుకే ప్రజలు బ్యాంక్ అకౌంట్లు లేదా నగదు రూపంలో డబ్బు దాచుకోవడం కంటే, రియల్ అసెట్స్ అంటే నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టాలని ఆయన సలహా ఇస్తున్నారు.

కియోసాకి దృష్టిలో బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్లు

నిజమైన సంపదను కాపాడుకోవడానికి, సంక్షోభం నుంచి బయటపడటానికి బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియంలలో పెట్టుబడి పెట్టాలని కియోసాకి సూచించారు. వీటిలో కూడా ముఖ్యంగా వెండి, ఎథీరియం అత్యుత్తమ పెట్టుబడి అని ఆయన చెప్పారు. ఎందుకంటే, ప్రస్తుతం ఈ రెండూ తక్కువ ధరలో ఉన్నాయని, రాబోయే రోజుల్లో వీటికి డిమాండ్ విపరీతంగా పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ ఆస్తులు కేవలం విలువను మాత్రమే కాకుండా, పరిశ్రమలలో కూడా ఉపయోగపడతాయి కాబట్టి సురక్షితమని ఆయన వివరించారు.

2025లో కియోసాకి ఆస్తుల జోరు

కియోసాకి సురక్షితమైన పెట్టుబడులుగా చెప్పే ఈ ఆస్తులు 2025లో అద్భుతంగా రాణించడం విశేషం. ఫిన్‌బోల్డ్ రీసెర్చ్ ప్రకారం, 2025 సెప్టెంబర్ వరకు బంగారం, వెండి, బిట్‌కాయిన్ సగటు రాబడి దాదాపు 40% గా ఉంది. ఇందులో వెండి ధర 47.5% పెరిగి $43.89/ఔన్స్‌కు చేరుకుంది. బంగారం 43% పెరిగింది, బిట్‌కాయిన్‌లో 21% వృద్ధి నమోదైంది. సంక్షోభం ఈ ఏడాది వచ్చినా రాకపోయినా, ప్రపంచ ఆర్థిక పరిస్థితి, బ్యాంకులపై తగ్గుతున్న విశ్వాసం నేపథ్యంలో బంగారం, వెండి, క్రిప్టో వంటి నిజమైన ఆస్తులే నిజమైన భద్రత అని కియోసాకి గట్టిగా చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story