రూ.500 ప్లాన్‌లో అమేజింగ్ ఆఫర్

Jio Happy New Year Plan : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, కోట్ల మంది వినియోగదారుల కోసం కొత్త హ్యాపీ న్యూ ఇయర్ 2026 ప్రీపెయిడ్ ప్లాన్‎ను కేవలం రూ.500 ధరతో విడుదల చేసింది. ఈ కొత్త ప్లాన్ ప్రధానంగా డేటా, వాయిస్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ల ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో ప్రతిరోజూ 2 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజులకు కలిపి మొత్తం 56 జీబీ హై-స్పీడ్ డేటా వస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా ఉంది. ముఖ్యంగా 5G ఫోన్లు ఉన్న, జియో 5G నెట్‌వర్క్ పరిధిలో ఉన్న వినియోగదారులకు ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం కూడా లభిస్తుంది.

ఓటీటీ వినోదాన్ని ఇష్టపడే వారికి రిలయన్స్ జియో ఈ కొత్త ప్లాన్ చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో ఒకటి కాదు, ఏకంగా 12 ఓటీటీ యాప్స్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ అందిస్తోంది. రూ.500 విలువైన ఈ కొత్త జియో ప్లాన్‌తో, ప్రీపెయిడ్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, యూట్యూబ్ ప్రీమియం, జియోహాట్‌స్టార్ (మొబైల్/టీవీ), జీ5, డిస్కవరీ ప్లస్, సోనీ లివ్, సన్ నెక్స్ట్, ప్లానెట్ మరాఠీ, లయన్స్‌గేట్ ప్లే, చౌపాల్, ఫ్యాన్‌కోడ్, హోయిచోయ్ వంటి పాపులర్ యాప్‌ల యాక్సెస్ లభిస్తుంది.

ఈ రూ.500 ప్లాన్‌తో పాటు జియో అదనపు ఆఫర్‌లను కూడా ఇస్తోంది. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు రూ.35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమినీ ప్రో ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది. అదనపు ప్రయోజనాలలో 50GB ఉచిత JioAICloud స్టోరేజ్, జియో ఫినాన్స్ ద్వారా జియో గోల్డ్ పై 1% అదనపు తగ్గింపు, కొత్త కనెక్షన్‌పై రెండు నెలల ఉచిత జియో హోమ్ ట్రయల్ లభిస్తాయి. ఈ ఆఫర్ ప్లాన్ వాలిడిటీ ముగిసిన తర్వాత కూడా జెమిని సదుపాయాన్ని కొనసాగించాలనుకుంటే, వినియోగదారులు కనీసం రూ.349 ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story