Jio : టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం, ముఖ్యంగా యూత్, గేమింగ్ లవర్స్ కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. యూత్ అండ్ గేమింగ్ ప్లాన్ పేరుతో వచ్చిన ఈ ప్లాన్ కేవలం డేటా మాత్రమే కాకుండా, వేల రూపాయల విలువైన ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తోంది. రూ.459 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ఆల్ ఇన్ వన్ ప్లాన్, సోషల్ మీడియా, స్ట్రీమింగ్ ఇష్టపడే వారికి ఒక వరం లాంటిదని చెప్పొచ్చు.

61జీబీ డేటా.. అన్లిమిటెడ్ 5G

జియో ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్ ధర రూ.459 కాగా, దీని వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లో ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా మరో 5జీబీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది, అంటే మొత్తం 61జీబీ డేటా మీ సొంతం. ఒకవేళ మీ ప్రాంతంలో జియో ట్రూ 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉంటే, మీరు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అన్లిమిటెడ్ 5G డేటాను ఎంజాయ్ చేయవచ్చు. రోజువారీ 100 SMSలు, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం ఎలాగో ఉంటుంది.

ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ల జాతర

ఈ ప్లాన్ లో అసలైన హైలైట్ ఏమిటంటే.. ఉచితంగా లభించే ప్రీమియం యాప్స్. ఈ రీఛార్జ్ తో మీకు Snapchat+, FanCode, మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. ఐపీఎల్ లేదా ఇతర స్పోర్ట్స్ చూసే వారికి ఫ్యాన్‌కోడ్, గేమర్ల కోసం జియో గేమ్స్ మొబైల్ సదుపాయం కూడా ఉంటుంది. అంతేకాకుండా, 50జీబీ వరకు జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా అందిస్తున్నారు.

రూ.35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో

సాధారణంగా గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ జియో తన యూజర్ల కోసం ఏకంగా 18 నెలల పాటు దీనికి ఉచిత యాక్సెస్‌ను కల్పిస్తోంది. దీని విలువ సుమారు రూ.35,100 ఉంటుందని అంచనా. దీంతో పాటు 5TB భారీ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. అయితే ఈ ఆఫర్లు కొనసాగాలంటే మీ నంబర్‌పై ఏదైనా యాక్టివ్ జియో ప్లాన్ ఉండటం తప్పనిసరి.

విదేశీ ప్రయాణీకులకు బంపర్ బోనస్

కేవలం లోకల్ యూజర్లకే కాకుండా, విదేశాలకు వెళ్లే వారికి కూడా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. జియో వై-ఫై కాలింగ్ ద్వారా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ లేకపోయినా ఇన్కమింగ్ SMSలు ఫ్రీగా పొందవచ్చు. దీనివల్ల విదేశాల్లో ఉన్నప్పుడు బ్యాంకింగ్ ఓటీపీలు లేదా అలర్ట్స్ సులభంగా అందుకోవచ్చు. యువతను, టెక్ ప్రేమికులను ఆకట్టుకోవడానికి జియో తెచ్చిన ఈ ఆల్-రౌండర్ ప్లాన్ మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story