భారీ రిటర్న్స్‌తో LIC రెండు కొత్త స్కీమ్స్‌

LIC New Plans : భారతదేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీ ఇటీవల రెండు కొత్త పాలసీలను ప్రవేశపెట్టింది. అవి: ఎల్‌ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886), ఎల్‌ఐసీ బీమా కవచ్ (ప్లాన్ 887). ఈ రెండు ప్లాన్‌లు వేర్వేరు ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. వీటిలో ఒకటి పెట్టుబడి, బీమా కలగలిసినది కాగా, మరొకటి పూర్తి ప్యూర్ లైఫ్ కవర్‎ను మాత్రమే అందిస్తుంది. మీ కుటుంబానికి పటిష్ట భద్రతతో పాటు మంచి రాబడిని అందించే లక్ష్యంతో ఈ పథకాలు తీసుకొచ్చారు.

1. ఎల్‌ఐసీ ప్రొటెక్షన్ ప్లస్

ఎల్‌ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ అనేది లైఫ్ కవర్‌తో పాటు పెట్టుబడి చేసుకునే అవకాశం కల్పించే యూలిప్ తరహా ప్లాన్. ఇది నాన్-పార్టిసిపేటింగ్, లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీదారుడు తన అవసరాన్ని బట్టి పెట్టుబడి ఫండ్‌ను ఎంచుకోవచ్చు, కవర్ మొత్తాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, అదనంగా టాప్-అప్ ప్రీమియం చెల్లించవచ్చు. ఐదేళ్ల తర్వాత కొంత మొత్తాన్ని పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది. కనీస వయస్సు 18, గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు. పాలసీ వ్యవధి 10, 15, 20 లేదా 25 సంవత్సరాలుగా ఎంచుకోవచ్చు. మెచ్యూరిటీ అయినప్పుడు, మీ యూనిట్ ఫండ్ విలువ మొత్తం మీకు అందుతుంది.

2. ఎల్‌ఐసీ బీమా కవచ్

ఎల్‌ఐసీ బీమా కవచ్ అనేది కేవలం కుటుంబ భద్రతను కోరుకునే వారి కోసం ఉద్దేశించిన నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. ఇందులో రిస్క్ కవర్ పూర్తిగా ఫిక్స్డ్, గ్యారెంటీడ్ గా ఉంటుంది. ఈ ప్లాన్‌లో, పాలసీదారుడు మొత్తం వ్యవధికి ఒకే విధమైన కవర్ (లేదా) క్రమంగా పెరిగే కవర్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లో కనీస బీమా మొత్తం రూ.2 కోట్లుగా నిర్ణయించారు, ఇది అధిక కవరేజీని సూచిస్తుంది. కనీస వయస్సు 18, గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు. మెచ్యూరిటీ వయస్సు ఏకంగా 100 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఇందులో సింగిల్ ప్రీమియం, లిమిటెడ్ పేమెంట్ (5, 10 లేదా 15 సంవత్సరాలు), రెగ్యులర్ పేమెంట్ వంటి సౌకర్యవంతమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్స్ ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story