LIC : ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్.. రూ.93 వేల పెట్టుబడితో రూ.5.45 లక్షల లాభం
రూ.93 వేల పెట్టుబడితో రూ.5.45 లక్షల లాభం

LIC : భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అంటేనే నమ్మకానికి మరో పేరు. జీవితాంతం మీతోనే.. జీవితం తర్వాత కూడా మీతోనే అనే క్యాప్షన్ తో కోట్లాది మంది భారతీయులకు ఆర్థిక భరోసానిస్తోంది ఈ సంస్థ. తాజాగా ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక ప్లాన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం రూ.93 వేలు ఒక్కసారి పెట్టుబడిగా పెడితే, మెచ్యూరిటీ సమయానికి అది ఏకంగా ఆరు రెట్లు పెరిగి రూ.5.45 లక్షలుగా మీ చేతికి వస్తుంది. స్టాక్ మార్కెట్ రిస్క్ లేకుండా, ప్రభుత్వ గ్యారెంటీతో డబ్బులు సంపాదించాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
చాలామంది ప్రతి నెలా ప్రీమియం కట్టలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం ఎల్‌ఐసీ సింగిల్ ప్రీమియం ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మీరు పదే పదే డబ్బులు కట్టాల్సిన పని లేదు, ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ పాలసీని 90 రోజుల పసిబిడ్డ నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. మీ అవసరాలకు తగ్గట్టుగా 10 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు పాలసీ కాలపరిమితిని ఎంచుకునే వెసులుబాటు ఉంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టి పెద్ద నిధిని సమకూర్చుకోవడానికి ఇది సరైన మార్గం.
ఈ లెక్కను జాగ్రత్తగా గమనిస్తే.. మీరు రూ.2 లక్షల బీమా మొత్తం గల పాలసీని ఎంచుకుంటే, జీఎస్టీతో కలిపి మీరు కట్టాల్సిన సింగిల్ ప్రీమియం దాదాపు రూ.93,193 మాత్రమే. మీరు 25 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకున్నట్లయితే, మెచ్యూరిటీ సమయానికి మీకు లభించే మొత్తం సుమారు రూ.5.45 లక్షలు. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి దాదాపు 6 రెట్ల లాభం అన్నమాట. ఇందులో కనీసం రూ.50,000 బీమా మొత్తం నుంచి మీరు పెట్టుబడిని ప్రారంభించవచ్చు, గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
ఒకవేళ మీరు ఈ పాలసీని పిల్లల పేరు మీద తీసుకోవాలనుకుంటే, వారికి 8 ఏళ్లు నిండినప్పటి నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రారంభమవుతుంది. ఈ స్కీమ్‌లో ప్రాణ భీమాతో పాటు పొదుపు ప్రయోజనం కూడా ఉంటుంది. పాలసీ కాలపరిమితి ముగియక ముందే పాలసీదారుడు మరణిస్తే, నామినీకి బీమా మొత్తంతో పాటు అదనపు ప్రయోజనాలను ఎల్‌ఐసీ అందిస్తుంది. ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కవచం కూడా.
మార్కెట్లో ఎన్నో పెట్టుబడి మార్గాలు ఉన్నప్పటికీ, ఎల్‌ఐసీకి ఉన్న క్రేజ్ వేరు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో మీ అసలు సొమ్ముకు 100 శాతం భద్రత ఉంటుంది. బ్యాంకు ఎఫ్‌డీల కంటే మెరుగైన రిటర్న్స్ ఆశిస్తూ, ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకునే మధ్యతరగతి ప్రజలకు ఈ ప్లాన్ ఒక వరం లాంటిది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి నిశ్చింతగా ఉండాలనుకునే వారికి, పిల్లల చదువుల కోసం లేదా భవిష్యత్తు అవసరాల కోసం ఈ పథకం ఉత్తమమైనది.

