నాసాలో వేల ఉద్యోగాలు పోతున్నాయా?

NASA : ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా, చంద్రుడు, అంగారకుడు వంటి ప్రతిష్టాత్మక మిషన్లపై పనిచేస్తున్న కీలక నిపుణులు దీని ప్రభావానికి లోనవుతున్నారని సమాచారం. అమెరికా ప్రభుత్వం, ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన నుండి వచ్చిన బడ్జెట్ కోతల ప్రతిపాదనలే ఈ పరిణామానికి ప్రధాన కారణం. నాసా ఉద్యోగులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష అభిమానుల్లో ఈ వార్త తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.

అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ పాలిటికో విడుదల చేసిన ఒక తాజా నివేదిక ఈ షాకింగ్ వివరాలను వెల్లడించింది. నాసాకు సంబంధించిన ఇంటర్నల్ డాక్యుమెంట్ల ఆధారంగా, మొత్తం 2,145 మంది సీనియర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. వీరంతా GS-13 నుండి GS-15 ర్యాంకుల్లో ఉన్న అధికారులు. ఈ 2,145 మందిలో, దాదాపు 1,818 మంది కీలకమైన శాస్త్రీయ, మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్లలో భాగస్వాములుగా ఉన్నారు. మిగిలిన వారు అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ వంటి సహాయక విభాగాలలో పనిచేస్తున్నారు.

ఈ పరిణామాలపై నాసా అధికారికంగా స్పందించింది. నాసా ప్రతినిధి బెథానీ స్టీవెన్స్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. సంస్థ తక్కువ బడ్జెట్‌లో కూడా తమ లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. అంతరిక్ష పరిశోధనలో అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగేలా, అలాగే చంద్రుడు, అంగారకుడి మిషన్లు విజయవంతం అయ్యేలా ప్రభుత్వం, కాంగ్రెస్ లతో కలిసి పనిచేస్తున్నామని తను వివరించారు. ఈ ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ , స్వచ్ఛంద బైఅవుట్ లేదా కొన్ని నెలల తర్వాత ఉద్యోగం వదులుకోవడం వంటి కొన్ని ఎంపికలను నాసా అందించిందని ఆమె పేర్కొన్నారు.

ఈ సెంటర్‌లలోనే చంద్రుడు, అంగారకుడికి సంబంధించిన కీలకమైన మిషన్ల కోసం విస్తృతమైన సన్నాహాలు జరుగుతున్నాయి. 2027 నాటికి చంద్రుడిపైకి మానవులను పంపే లక్ష్యం, అలాగే భవిష్యత్తులో అంగారక గ్రహ మిషన్లు వంటి కఠినమైన డెడ్ లైన్స్ ఉన్న నేపథ్యంలో, ఇంత మంది సిబ్బందిని ఒకేసారి కోల్పోవడం నాసాకు పెద్ద దెబ్బ తగులుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story