New Government Rule : ఒకే బర్త్ సర్టిఫికెట్ తో రెండు ఆధార్ కార్డులు.. కేంద్రం కొత్త రూల్స్
కేంద్రం కొత్త రూల్స్

New Government Rule : ఒకే బర్త్ సర్టిఫికెట్ పై నకిలీ బాల ఆధార్ నమోదులను నిరోధించడానికి UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆధార్ రెగ్యులేషన్, 2016లో మార్పులు చేసింది. ఈ సవరణల గురించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త నోటిఫికేషన్‌లో మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్‌లను నిష్క్రియం చేయడానికి సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. కొత్త నియమం ప్రకారం.. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతితో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఆధార్ నంబర్‌ను భారత రిజిస్ట్రార్ జనరల్‌తో లేదా బర్త్ అండ్ డెత్ యాక్ట్, 1969 కింద నియమించబడిన ఏదైనా స్టేట్ చీఫ్ రిజిస్ట్రార్‌తో UIDAI పంచుకోవచ్చు. దీని లక్ష్యం ఒకే బర్త్ సర్టిపికెట్ పై రెండు వేర్వేరు బాల ఆధార్ కార్డులు రాకుండా నిరోధించడం.
UIDAI ప్రకారం బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా బయోమెట్రిక్ సమాచారం సేకరించకుండానే నమోదు చేయబడిన పిల్లల ఆధార్ నంబర్‌ను పంచుకోవచ్చు. దీని ద్వారా ఒకే బర్త్ సర్టిఫికెట్ తో రెండు ఆధార్ కార్డులను పొందే ప్రయత్నాలను నిరోధించవచ్చు.
బాల ఆధార్ నమోదు ప్రక్రియ
తల్లిదండ్రుల ఆధార్ కార్డు తప్పనిసరి: బాల ఆధార్ నమోదు కోసం తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ కార్డు తప్పనిసరి. మీ పిల్లల నమోదు కోసం, తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ కార్డుతో పాటు పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని కూడా తీసుకురావాలి.
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల నమోదు ప్రక్రియ: ఆధార్ నమోదు కోసం ఆసక్తి ఉన్న భారతీయ నివాసి లేదా ప్రవాస భారతీయ పిల్లవాడు తల్లి, తండ్రి లేదా చట్టపరమైన సంరక్షకుడితో కలిసి ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి అవసరమైన పత్రాలతో నమోదు ఫారమ్‌ను సమర్పించాలి.
ఆధార్ నమోదు సమయంలో ఈ సమాచారం అడుగుతారు:
* పిల్లల పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వివరాలు.
* తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడి వివరాలు.
* తల్లిదండ్రులలో ఒకరు లేదా సంరక్షకుడు పిల్లల తరపున పత్రాలను ధృవీకరించి, నమోదు ఫారమ్‌పై సంతకం చేసి, మైనర్ నమోదుకు సమ్మతి ఇవ్వాలి.
* బయోమెట్రిక్ సమాచారంలో భాగంగా పిల్లల ఫోటోను అందించాలి.
* అక్టోబర్ 1, 2023 తర్వాత జన్మించిన పిల్లలకు జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి.
మరణించిన వారి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం
అదే నోటిఫికేషన్‌లో, UIDAI మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్‌లను నిష్క్రియం చేయడానికి ఒక నిబంధనను చేర్చింది. దీని ప్రకారం, ఆధార్ (ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేషన్) రెగ్యులేషన్, 2016లోని సెక్షన్ కింద మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్‌ను డియాక్టివేట్ చేయడం జరుగుతుంది.
