Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్‌తో కొత్త తలనొప్పి.. ప్లాట్‌ఫామ్ ఫీజులతో ప్రజలకు ఇబ్బందులు
ప్లాట్‌ఫామ్ ఫీజులతో ప్రజలకు ఇబ్బందులు

Online Shopping: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ, ఈ మధ్య కన్వీనియన్స్ ఫీజు పేరుతో కొన్ని ఎక్స్ ట్రా మనీ కట్టాల్సి వస్తుంది. ఇది వినియోగదారులకు కొత్త తలనొప్పిగా మారింది. ప్రతి ఇద్దరు కస్టమర్లలో ఒకరు చాలా ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఈ ఫీజులు కట్టాల్సి వస్తుందని అంటున్నారు. మొదట్లో కొన్ని రకాల వాటికి మాత్రమే ఈ ఫీజులు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ-కామర్స్ సైట్లు, డిజిటల్ పేమెంట్స్, టికెటింగ్ సర్వీసులన్నిటికీ ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 10 మందిలో 8 మంది కస్టమర్లు, ఎలాంటి కన్వీనియన్స్ ఫీజులు తీసుకోని ప్లాట్‌ఫామ్స్ ఉంటే వాటికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 62% మంది కస్టమర్లు, తాము కొన్న ఎక్కువ టికెట్లు లేదా సర్వీసులకు ఈ ఫీజు కట్టామని తెలిపారు. 52% మంది, నిత్యవసర వస్తువుల ఆన్‌లైన్ కొనుగోళ్లపై కూడా ఈ ఫీజులు చెల్లించామని చెప్పారు. అంటే, దాదాపు 90% మంది కస్టమర్లు ఈ ఫీజులు లేకుండా కొనుగోళ్లు చేయాలని కోరుకుంటున్నారు.
ఈ మధ్యే అమెజాన్ ఇండియాతో పాటు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, అజియో లాంటి క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అన్నీ, ప్రతి ఆర్డర్‌పై రూ. 5 మార్కెట్‌ప్లేస్ ఫీజును మొదలుపెట్టాయి. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లు డెలివరీ కోసం ఇప్పటికే డబ్బులు కడుతున్నా, వాళ్ల ఆర్డర్‌లకూ ఈ ఫీజు వర్తిస్తుంది. గిఫ్ట్ కార్డులు, డిజిటల్ సర్వీసులకు మాత్రం ఈ ఫీజు లేదు.
వాస్తవానికి ఆర్‌బీఐ 2022లో ఒక రూల్ పెట్టింది. దాని ప్రకారం, ఏదైనా ఫీజు తీసుకునే ముందు ఆన్‌లైన్ సంస్థలు కస్టమర్‌కు స్పష్టంగా చెప్పాలి, అది ఎంత అనేది చూపించాలి. కానీ, సర్వే ప్రకారం, చాలా కంపెనీలు ఈ ఫీజు గురించి ముందే సరిగ్గా చూపించడం లేదు. కొన్ని షాపులు కూడా కార్డు పేమెంట్స్, ముఖ్యంగా క్రెడిట్ కార్డుల వాడకంపై 3% వరకు ఛార్జీలు వేస్తున్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు క్రెడిట్ కార్డుతో కడితే రూ. 2,000కి పైగా ఛార్జీలు పడుతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. మొత్తంగా, ఆన్‌లైన్ షాపింగ్ సులభం చేస్తున్నా ఈ కన్వీనియన్స్ ఫీజులు వినియోగదారులకు భారంగా మారుతున్నాయి.
