Rapido Ownly : డెలివరీ, ఫ్యాకేజింగ్ ఛార్జీలు లేవు.. ఆన్ లైన్ ఫుల్ డెలివరీలో రాపిడో సెన్సేషన్
ఆన్ లైన్ ఫుల్ డెలివరీలో రాపిడో సెన్సేషన్

Rapido Ownly : డెలివరీ, ఫ్యాకేజింగ్ ఛార్జీలు లేవు.. ఆన్ లైన్ ఫుల్ డెలివరీలో రాపిడో సెన్సేషన్
Rapido Ownly : భారతదేశంలో ట్యాక్సీ సేవలను అందించే ప్రముఖ సంస్థ'రాపిడో'ఇప్పుడు ఫుడ్ డెలివరీ మార్కెట్లో కూడా పెద్ద సంచలనం సృష్టించబోతోంది. 'ఓన్లీ' అనే తమ కొత్త సర్వీసు ద్వారా రాపిడో, జొమాటో, స్విగ్గీ వంటి దిగ్గజ కంపెనీలకు నేరుగా సవాల్ విసిరింది. ఓన్లీ ద్వారా ఇప్పటివరకు వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టిన డెలివరీ ఫీజులు, ప్యాకేజింగ్ ఛార్జీలు, కొన్నిసార్లు హిడెన్ ట్యాక్సీలు వంటి అన్ని అదనపు ఛార్జీలను కంపెనీ తీసేస్తుంది.
రాపిడో-ఓన్లీ ప్రత్యేకతలు ఏంటి?
రాపిడో కొత్త 'ఓన్లీ' సర్వీసు ప్రత్యేకత ఏంటంటే వినియోగదారుడికి ఆహారం హోటల్ లేదా రెస్టారెంట్ ధరకే లభిస్తుంది. అతను ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్‌లో కూర్చుని తిన్నా అంతే ఖర్చు అవుతుంది. డెలివరీ ఛార్జీలు ఉండవు. ప్యాకేజింగ్ ఫీజు ఉండదు. అంటే, మెనూ కార్డులో ఉన్న ధరకే మీ ఇంటికి ఆహారం వస్తుందన్నమాట. ఇది వినియోగదారులకు చాలా పెద్ద ప్రయోజనం.
రెస్టారెంట్లకు కూడా ఓన్లీ వల్ల లాభమే
'ఓన్లీ' మోడల్ రెస్టారెంట్లకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలు 25-30శాతం వరకు పెద్ద కమీషన్లను వసూలు చేస్తాయి. కానీ, రాపిడో కేవలం ఒక చిన్న ఫ్లాట్ సబ్‌స్క్రిప్షన్ ఫీజును మాత్రమే తీసుకుంటుంది. దీనివల్ల రెస్టారెంట్లకు ఎక్కువ లాభం కలిపిస్తుంది.
40 లక్షల రైడర్ నెట్‌వర్క్
రాపిడోకు ఇప్పటికే 40 లక్షల మంది 'కెప్టెన్లు' (రైడర్లు - అంటే డెలివరీ చేసేవారు) ఉన్నారు. ఈ రైడర్ల నెట్‌వర్క్‌ను ఫుడ్ డెలివరీలో కూడా ఉపయోగిస్తారు. దీనివల్ల: డెలివరీ లాజిస్టిక్స్ సమస్యలు రావు. డెలివరీ స్పీడ్ కూడా ఫాస్టుగా ఉంటుంది. ఈ విస్తృతమైన రైడర్ల నెట్‌వర్క్ రాపిడోకు పెద్ద ప్లస్ పాయింట్ ఇది మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా మారవచ్చు.
జొమాటో, స్విగ్గీలలో అలజడి
రాపిడో ఈ ప్రకటన చేసిన తర్వాత జొమాటో, స్విగ్గీ వంటి పెద్ద కంపెనీల వ్యూహాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు వినియోగదారులు సహజంగానే తక్కువ ధరలు ఉన్న వైపు ఆకర్షితులవుతారు. చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ఇప్పుడు చౌకైన ఆహారం కేవలం రెస్టారెంట్‌కు మాత్రమే పరిమితం కాదు. అదే ధరకు ఇంటికి కూడా వస్తుంది" అని కామెంట్లు చేస్తున్నారు.
భారతీయ ఫుడ్ డెలివరీ మార్కెట్ మారుతుందా?
భారతదేశంలో ఫుడ్ డెలివరీ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. దీని విలువ సుమారు రూ.40 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇలాంటి సమయంలో రాపిడో ఎంట్రీ మార్కెట్లో తక్కువ ధరలు, ఎక్కువ పారదర్శకత అనే కొత్త ట్రెండ్‌ను తీసుకురావచ్చు. ఇది రాబోయే రోజుల్లో ఫుడ్ డెలివరీ రంగంలో పెద్ద మార్పులకు దారితీయవచ్చు.
