UPI : ఆన్లైన్ పేమెంట్స్ మరింత వేగంగా, సురక్షితంగా..యూపీఐలో కొత్త మార్పులు
యూపీఐలో కొత్త మార్పులు

UPI : ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ చేతిలో డబ్బులు ఉంచుకోవడం మానేశారు. స్మార్ట్ ఫోన్ల సాయంతో UPI పేమెంట్స్ చేస్తున్నారు. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు దీని ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. ఇప్పుడు జూన్ 16, అంటే ఈ రోజు నుండి UPIలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. ఇది మీ ట్రాన్సాక్షన్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీరు Google Pay, PhonePe లేదా ఏదైనా UPI ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నట్లయితే గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. UPI సిస్టమ్‌లో ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకుందాం.
ఇక నుండి UPI పేమెంట్స్ మరింత వేగంగా, సేఫ్ గా, స్మార్ట్‌గా మారతాయి. NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) UPI సిస్టమ్‌లో పెద్ద అప్‌గ్రేడ్‌ను ప్రారంభించింది. దీనితో లావాదేవీల వేగం 66 శాతం వరకు పెరుగుతుంది. చెల్లింపులు ఫెయిల్ అయినా లేదా రీఫండ్ అయినా ఇదివరకు కంటే చాలా వేగంగా జరుగుతుంది. మొత్తం ప్రక్రియ మరింత సురక్షితంగా ఉంటుంది.
NPCI ప్రకారం చెల్లింపు పంపడానికి, ప్రతిస్పందన రావడానికి పట్టే సమయం 30 సెకన్ల నుండి 15 సెకన్లకు తగ్గింది. ఒకవేళ లావాదేవీ విఫలమైతే, వాపసు ఇప్పుడు కేవలం 10 సెకన్లలో పూర్తవుతుంది. స్టేటస్ చెక్ చేయడం, అడ్రస్ కన్ఫాం కావడం వంటి పనులు కూడా ఇప్పుడు కేవలం 10 సెకన్లలో పూర్తవుతాయి. ప్రతిరోజూ UPIలో కోట్లాది లావాదేవీలు జరుగుతాయి. ఇంత ఎక్కువ ట్రాఫిక్ కారణంగా సిస్టమ్‌పై భారం పెరుగుతుంది. చాలా సార్లు చెల్లింపులు నిలిచిపోవడం లేదా ఆలస్యంగా చేరడం జరుగుతుంది. ఇప్పుడు NPCI టెక్నాలజీ లెవల్లో అలాంటి మెరుగుదల చేసింది. దీనివల్ల ఈ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి.
ఈ అప్ డేట్స్ అన్ని UPI సర్వీస్ ప్రొవైడర్‌లకు వర్తిస్తాయి. ఇందులో Google Pay, PhonePe, Paytm UPI, BHIM, WhatsApp UPI, అన్ని బ్యాంకింగ్ UPI యాప్‌లు ఉన్నాయి. దీని అర్థం ఏ యాప్‌ను ఉపయోగించే వ్యక్తి అయినా ఇప్పుడు మునుపటి కంటే వేగవంతమైన పేమెంట్స్ ఎక్స్ పీరియన్స్ ఆస్వాదించగలరు. వినియోగదారులు లావాదేవీలు విఫలమైనప్పుడు, వాపసు కోసం ఇకపై ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.UPI, Digital Payments, NPCI, PhonePe, Google Pay, Faster Transactions, Instant Refunds, Security, Banking Apps
