కపై అద్దెకు కూడా ఇళ్లు

OYO : హోటల్ బుకింగ్స్, వెకేషన్ హోమ్స్ వ్యాపారంలో ఇప్పటికే పాపులర్ అయిన ఓయో ఇప్పుడు అద్దె ఇళ్ల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది. ఇందులో భాగంగా, ఓయో యూరోపియన్ అనుబంధ సంస్థ అయిన బెల్విల్లా ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన స్టార్టప్ కంపెనీ మెడ్‌కాంఫీని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో ఓయో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి సిద్ధంగా ఉంది.

క్విరిన్ ష్వైఘోఫర్, సబ్రినా బెతూనిన్ అనే ఇద్దరు కలిసి 2015లో మెడ్‌కాంఫీ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ ఆస్ట్రేలియాలో 1,200కు పైగా ప్రాపర్టీలను నిర్వహిస్తోంది. సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్ వంటి నగరాల్లో దీనికి కార్యాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, వెల్లింగ్టన్, హామిల్టన్ నగరాల్లో కూడా ఈ కంపెనీ తన సేవలను అందిస్తోంది. ఇటీవల ఈ కంపెనీ మొత్తం బుకింగ్ విలువ 60 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. కొనుగోలు తర్వాత కూడా కంపెనీ వ్యవస్థాపకులు దానిని నడిపించనున్నారు.

మెడ్‌కాంఫీ వ్యవస్థాపకుడు ష్వైఘోఫర్ లింక్‌డిన్‌లో ఒక పోస్ట్ ద్వారా ఈ కొనుగోలును అధికారికంగా ధృవీకరించారు. మెడ్‌కాంఫీని ఓయోను కొనుగోలు చేసింది. చెక్‌మైగెస్ట్, బెల్విల్లా వంటి హాస్పిటాలిటీ బ్రాండ్‌లతో కలిసి ఓయో కుటుంబంలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉందని ఆయన రాశారు. ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఈ కొనుగోలుపై సంతోషం వ్యక్తం చేస్తూ, మెడ్‌కాంఫీతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. ఈ డీల్‌లో 1.9 మిలియన్ డాలర్ల అడ్వాన్స్ ఈక్విటీ, 9.6 మిలియన్ డాలర్ల డిఫర్డ్ స్టాక్ ఉన్నాయి.

ఓయో ఈ కొనుగోలుతో తన వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తోంది. ప్రస్తుతానికి ఓయో విలువ సుమారు 5 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఈ కొనుగోలుతో ఓయో, ప్రపంచవ్యాప్తంగా వెకేషన్ హోమ్స్ మార్కెట్‌లో తన పట్టును మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story