కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మంత్రి లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్ లో బిపిసిఎస్ సంస్థ నిర్మించే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ త్వరితగతిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సహకారం అందించాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మంత్రి లోకేష్ డిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టు సమీపాన బిపిసిఎల్ సంస్థ 6వేల ఎకరాల్లో రూ.95వేల కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన రిఫైనరీ – కమ్ – పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించారు. రిఫైనరీకి అవసరమైన అదనపు భూసేకరణను రాష్ట్రప్రభుత్వ అధికారులు సమన్వయం చేస్తున్నారు. 9ఎంఎంటిపిఎ సామర్థ్యంతో నిర్మితమయ్యే బిపిసిఎల్ రిఫైనరీ కర్మాగారం ద్వారా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా వేగవంతమైన అభివృద్ధి సాధించడమేగాక, 5వేలమందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఏడాది చివరకు బిపిసిఎల్ రిఫైనరీ ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం తరపున అన్నివిధాల సహాయ, సహకారాలను అందిస్తున్నాం, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసేందుకు కేంద్రం తమవంతు సహకారాన్ని అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.

దేశీయ నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ఓఎన్ జిసికి చెందిన జాక్ ఆఫ్ రిగ్ కాంట్రాక్టును సాధించేందుకు హిందుస్తాన్ షిప్ యార్డు లిమిటెడ్ (HSL)కు కేంద్రం నుంచి సహకారం అందించండి. ఇది భారతదేశ నౌకానిర్మాణ, ఆఫ్ షోర్ ఇంజనీరింగ్ సామర్థ్యాలను పెంచుతుంది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ తన శాటిలైట్ షిప్ యార్డును ఉత్తరాంధ్రలో విస్తరిస్తోంది. ఓడల మరమ్మతులు, కోస్టల్ క్రూయిజ్ టూరిజం, మారిటైమ్ లాజిస్టిక్స్ ను సులభతరం చేయడం హెచ్ఎస్ ఎల్ లక్ష్యం. హెచ్ఎస్ ఎల్ కు రిగ్ కాంట్రాక్ట్ లభించినట్లయితే ఎపిలో యువతకు ఉద్యోగాలు రావడమేగాక ఎంఎంఎస్ఇలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో తీరం వెంట మారిటైమ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఉపకరిస్తుందని మంత్రి లోకేష్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో దీపం-2 పథకం కింద బిపిఎల్ కుటుంబాలను బలోపేతం చేసేందుకు ప్రతిఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలండర్లను అందజేస్తున్నాం. దీనిని ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై)తో అనుసంధానం చేసి మరింత సమర్థవంతంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాలని మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు. ఎనర్జీ, మారిటైమ్ రంగాల్లో వ్యూహాత్మక పెట్టుబడులు, అనుమతులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందిగా లోకేష్ కోరారు. విధానపరమైన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో డిజిటల్ ప్లాట్ ఫాం వినియోగం, టెక్నాలజీ అడాప్షన్ కు రాష్ట్రప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తుంది. రాష్ట్రంలోని ప్రతిపాదిత ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతులు, సాంకేతిక మద్దతు అందిస్తున్నందుకు కేంద్రమంత్రికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story