మీ ఊరిలోనే కేవైసీ క్యాంపులు

PM Jan Dhan Accounts: పీఎం జన్ ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతాలు తెరిచిన వారికి ఇది చాలా ముఖ్యమైన సమాచారం. ఈ పథకం ప్రారంభమై దాదాపు 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఖాతాలలో చాలా వాటికి తిరిగి కేవైసీ చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఒక కీలక ప్రకటన చేశారు.

కేవైసీ రెన్యువల్ కోసం బ్యాంకులు ప్రజల దగ్గరికే వస్తున్నాయి. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా లక్ష గ్రామ పంచాయతీల్లో కేవైసీ క్యాంపులను ఏర్పాటు చేశాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఈ క్యాంపులలో జన్ ధన్ ఖాతాదారులు తమ కేవైసీని సులభంగా రెన్యువల్ చేసుకోవచ్చు.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కస్టమర్ల వివరాలను కాలానుగుణంగా అప్ డేట్ చేస్తుంటాయి. కస్టమర్ వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, చిరునామాలో ఏమైనా మార్పులు ఉన్నాయా వంటి విషయాలను తెలుసుకోవడానికి కేవైసీ తప్పనిసరి. పీఎం జన్ ధన్ యోజన కింద ఇప్పటివరకు 55 కోట్ల అకౌంట్లు తెరవబడ్డాయి. వీటిలో పదేళ్ల క్రితం తెరిచిన అకౌంట్లు చాలా ఉన్నాయి. అందుకే, వాటిని తిరిగి అప్ డేట్ చేసుకోవాలి.

ఈ క్యాంపులలో కేవలం కేవైసీ అప్ డేట్ మాత్రమే కాకుండా, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బ్యాంక్ అధికారులు చిన్న బీమా పథకాలు, పెన్షన్ పథకాలు వంటి వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే, వినియోగదారుల సమస్యలను విని, పరిష్కారాలను కూడా అందిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story