కేంద్ర మంత్రి కీలక సూచన

PM Kisan : దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత నిధుల విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. వాస్తవానికి ఈ నెలలోనే నిధులు విడుదల అవుతాయని భావించినా, కొన్ని మీడియా నివేదికలు మాత్రం నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లోకి త్వరలోనే రూ.2,000 జమ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే, నిధులు త్వరగా విడుదల కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటనే దానిపై మంత్రి ఒక కీలక సూచన చేశారు.

పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్న 21వ విడత నిధులు నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లోకి రూ.2,000 త్వరలోనే జమ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, నిధుల విడుదల వేగవంతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనిని మంత్రి స్పష్టంగా చెప్పారు. ఆధార్ సీడింగ్, ఈ-కేవైసీ ప్రక్రియలను వెంటనే పూర్తి చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. రాష్ట్రాల నుంచి రైతులకు సంబంధించిన సరిచూసిన తుది జాబితా ఎంత త్వరగా కేంద్రానికి చేరుకుంటే, అంత త్వరగా డబ్బులు విడుదలవుతాయి.

సాధారణంగా నిర్ణయించిన తేదీ కంటే ముందుగానే కొన్ని రాష్ట్రాల్లో 21వ విడత నిధులు విడుదలయ్యాయి. పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గత నెల (సెప్టెంబర్ 26)లోనే ఈ కంటెంమెంట్ డబ్బులను విడుదల చేశారు. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు సంభవించాయి. దీని వల్ల రైతులకు ఉపశమనం అందించే ఉద్దేశంతో పీఎం కిసాన్ నిధులను ముందుగానే అడ్వాన్స్‌గా అందించారు. మిగిలిన రాష్ట్రాల రైతులకు మాత్రం నవంబర్‌లో అందే అవకాశం ఉంది.

నవంబర్ మొదటి వారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఉన్నందున, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయా అనే సందేహం చాలా మందికి ఉంది. ఎన్నికల కోడ్ ప్రకారం.. ప్రభుత్వం కొత్త పథకాలు లేదా కొత్త హామీలను ప్రకటించకూడదు. అయితే, ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డంకి కాదు. కాబట్టి, పీఎం కిసాన్ అనేది ఇప్పటికే అమలులో ఉన్న పథకం కాబట్టి, నిధుల విడుదలకు ఎటువంటి సమస్య ఉండదని తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story