Post Office Bumper Offer: పోస్ట్ ఆఫీస్ బంపర్ ఆఫర్.. పెళ్లైన వారికి డబుల్ లాభం, నెలకు రూ.10,000 ఆదాయం
పెళ్లైన వారికి డబుల్ లాభం, నెలకు రూ.10,000 ఆదాయం

Post Office Bumper Offer: మీకు పెళ్లయిందా ? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భవిష్యత్తు కోసం ఏదైనా సురక్షితమైన పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా చేతికి కొంత డబ్బు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీకోసం పోస్ట్ ఆఫీస్ ఒక అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చింది. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS). ఈ ప్రభుత్వ పథకం పెళ్లైన జంటలకు చాలా బాగా పనికొస్తుంది. ఈ పథకం పేరులోనే ఉంది. ఇది ప్రతి నెలా మీకు ఒక ఫిక్స్డ్ డబ్బును ఇస్తుంది. మీరు పెట్టిన డబ్బుకు, దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెలా అందిస్తారు. ముఖ్యంగా, ఎవరైతే తమ డబ్బును సురక్షితమైన చోట పెట్టి, ప్రతి నెలా ఖర్చుల కోసం కొంత ఆదాయం కావాలనుకుంటారో వాళ్ల కోసమే ఈ పథకం.
ఈ స్కీమ్‌లో ఉన్న పెద్ద లాభం ఏంటంటే, ఇందులో సింగిల్ అకౌంట్ అయినా తెరవొచ్చు, లేదా జాయింట్ అకౌంట్ అయినా తెరవొచ్చు. పెళ్లైన దంపతులు కలిసి జాయింట్ అకౌంట్ తెరిస్తే, ఎక్కువ డబ్బు పెట్టొచ్చు, దానివల్ల ప్రతి నెలా ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇదే ఇందులో ఉన్న డబుల్ బెనిఫిట్.
వడ్డీ రేటు, ఎంత పెట్టొచ్చు?
ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.4%. దీనిలో సుమారు మినిమం 5ఏళ్లు పెట్టుబడి పెట్టొచ్చు. కావాలంటే టైం పెంచుకోవచ్చు. ఒకరి పేరుపై (సింగిల్ అకౌంట్) గరిష్టంగా రూ.9 లక్షలు. ఇద్దరి పేర్లపై (జాయింట్ అకౌంట్) గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టొచ్చు. జాయింట్ అకౌంట్లో, ఖాతాదారులు అందరి వాటా సమానంగా ఉంటుంది. వడ్డీ కూడా అందరికీ పంచుకుంటుంది.
ప్రతి నెలా ఎంత డబ్బు వస్తుంది?
మీరు మీ భాగస్వామితో కలిసి రూ.15 లక్షలు జాయింట్ అకౌంట్లో పెడితే సంవత్సరానికి వచ్చే వడ్డీ రూ.1,11,000. ప్రతి నెలా వచ్చే ఆదాయం దాదాపు రూ.9,250. ఒకవేళ మీరు రూ.9 లక్షలు సింగిల్ అకౌంట్లో పెడితే సంవత్సరానికి వచ్చే వడ్డీ రూ.66,600. అంటే ప్రతి నెల మీకు రూ.5,550 ఆదాయం వస్తుంది. భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ తెరిస్తే, ప్రతి నెలా రూ.9,250 వరకు స్థిరమైన ఆదాయం పొందొచ్చు. ఇది ఇంటి ఖర్చులకు, ఇతర అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది.
ఎవరు తెరవొచ్చు ఈ అకౌంట్?
18 ఏళ్లు నిండిన ఎవరైనా సింగిల్ అకౌంట్ తెరవొచ్చు. గరిష్టంగా ముగ్గురు పెద్దవాళ్లు కలిసి (జాయింట్ A లేదా జాయింట్ B రకం అకౌంట్స్) ఓపెన్ చేయవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మైనర్ (18 ఏళ్ల లోపు పిల్లలు) పేరుతో కూడా అకౌంట్ తెరవొచ్చు. 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్లు తమ పేరు మీద అకౌంట్ తెరవొచ్చు.
