పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లలో నో ఛేంజ్

Postoffice : ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాల అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించిన వడ్డీ రేట్లను సమీక్షించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. ఈసారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే, కస్టమర్లకు గత త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లే ఈ కొత్త త్రైమాసికంలో కూడా కొనసాగనున్నాయి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలకు గరిష్టంగా 8.20% వడ్డీ లభిస్తుండగా, ఇతర పథకాల వివరాలను కింద చూడొచ్చు.

2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు పోస్ట్ ఆఫీస్ పథకాలకు వర్తించే వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

పథకం పేరు వడ్డీ రేటు

సేవింగ్స్ డిపాజిట్ 4%

టర్మ్ డిపాజిట్ 1 సంవత్సరం 6.90%

టర్మ్ డిపాజిట్ 2 సంవత్సరాలు 7.00%

టర్మ్ డిపాజిట్ 3 సంవత్సరాలు 7.10%

టర్మ్ డిపాజిట్ 5 సంవత్సరాలు 7.50%

పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ (5 సంవత్సరాలు) 6.70%

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (5 సంవత్సరాలు) 7.70%

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఆదాయ పథకం(MIS) 7.40%

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) 7.10%

కిసాన్ వికాస్ పత్ర(KVP) 7.50%

సుకన్య సమృద్ధి యోజన(SSY) 8.20%

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(SCSS) 8.20%

అత్యధిక రాబడి ఇచ్చే పథకాలు

పోస్ట్ ఆఫీస్ పథకాలలో సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లకు అత్యధికంగా 8.20% వడ్డీ లభిస్తోంది. ముఖ్యంగా, సీనియర్ సిటిజన్స్ స్కీమ్‎లో లభించే ఈ అధిక వడ్డీ రేటు, చాలా ప్రధాన బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువగా ఉంది. అలాగే, ఐదు సంవత్సరాల టర్మ్ డిపాజిట్లకు పోస్ట్ ఆఫీస్ ఇచ్చే 7.50% వడ్డీ కూడా అనేక ప్రధాన బ్యాంకుల కంటే ఎక్కువగానే ఉంది.

దీర్ఘకాలిక పెట్టుబడికి పీపీఎఫ్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‎లో ప్రస్తుతం 7.10% వడ్డీ లభిస్తుంది. వడ్డీ రేటు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, పీపీఎఫ్ దీర్ఘకాలిక పెట్టుబడికి చాలా అనుకూలమైన పథకం. దీనికి ప్రధాన కారణం, ఇందులో జమ చేసే మొత్తం, వచ్చే వడ్డీ, మరియు మెచ్యూరిటీ మొత్తం అన్నీ పన్ను రహితం కావడం. ఈ పథకం కనీస కాలపరిమితి 15 సంవత్సరాలు, సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. మెచ్యూరిటీ తర్వాత కూడా ఈ పథకాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story