Post Office Update: చిన్న పొదుపు పథకాలకు శుభవార్త.. పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు స్థిరం!
పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు స్థిరం!

Post Office Update: ప్రభుత్వం నడిపే చిన్న పొదుపు పథకాలకు రాబోయే త్రైమాసికంలో కూడా ఇప్పుడున్న వడ్డీ రేట్లే కొనసాగుతాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జూలై నుంచి సెప్టెంబర్ 2025) ప్రభుత్వం వడ్డీ రేట్లను ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో ఉన్న రేటునే కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకాలకు కూడా వడ్డీ రేట్లు తగ్గొచ్చని వార్తలు గట్టిగా ప్రచారం అయ్యాయి. ఈ చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారిలో ఆసక్తి నెలకొంది. అయితే, పాత వడ్డీ రేట్లనే కొనసాగించాలని నిర్ణయించడం ఈ పెట్టుబడిదారులకు ఊరటనిచ్చింది.
గత ఐదు నెలల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. చాలా బ్యాంకులు రుణాలపై, డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. కానీ, పోస్ట్ ఆఫీస్ పథకాలకు మాత్రం ప్రస్తుత రేట్లే కొనసాగనున్నాయి.
జూలై-సెప్టెంబర్ 2025 త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు
ఇక్కడ వివిధ పథకాలకు సంబంధించిన వడ్డీ రేట్లు ఉన్నాయి:
* సుకన్య సమృద్ధి యోజన (SSY అకౌంట్): సంవత్సరానికి 8.2% వడ్డీ.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): 7.1% వడ్డీ.
* కిసాన్ వికాస్ పత్ర (KVP): 7.5% వడ్డీ.
* జాతీయ పొదుపు పత్రం (NSC): 7.7% వడ్డీ.
* నెలవారీ ఆదాయ పథకం (Monthly Income Scheme): 7.4% వడ్డీ.
* పోస్ట్ ఆఫీస్ 3 సంవత్సరాల డిపాజిట్: 7.1% వడ్డీ.
* పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్: 4% వడ్డీ.
ఈ పైన పేర్కొన్న అన్ని పథకాలు అన్న పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. పీపీఎఫ్, ఎస్ఎస్వై పథకాలను కొన్ని బ్యాంకుల్లో కూడా చేసుకోవచ్చు.
