దుబాయ్ వదిలి ఇండియాకు రావడానికి కారణాలివే

Work Culture : దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాలలో ఉద్యోగం సంపాదించడం చాలా మంది భారతీయుల కల. అక్కడ లక్షల్లో జీతం, టాక్స్ ఫ్రీ ఆదాయం దొరుకుతుంది. అయితే నెలకు రూ. 7.5 లక్షల భారీ జీతాన్ని, సేవింగ్స్‌ను వదులుకుని కేవలం మూడు నెలల్లోనే ఉద్యోగం మానేసి స్వదేశానికి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అతని పేరు ఎడ్విన్ నెట్టో. ప్రస్తుతం బెంగళూరులోని గూగుల్‌లో పనిచేస్తున్న ఈ ప్రొడక్ట్ డిజైనర్.. తాను దుబాయ్‌లో ఉద్యోగం మానేయడానికి గల నిజమైన కారణాన్ని వివరించాడు.

7.5 లక్షల జీతం, భారీ సేవింగ్స్

ప్రొడక్ట్ డిజైనర్ అయిన ఎడ్విన్ నెట్టో అబుదాబిలో నెలకు 30,000 AED (దాదాపు రూ.7.5 లక్షలు) జీతం అందుకునేవారు. ఇది పూర్తిగా టాక్స్ ఫ్రీ కావడం వలన, ఇందులో సుమారు 10,000 AED మాత్రమే ఖర్చుల కోసం పోగా, నెలకు 20,000 AED (సుమారు రూ.5 లక్షలు) సేవింగ్స్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అంటే, ఆర్థికంగా ఎంతో ప్రయోజనం ఉన్నప్పటికీ, ఆ పని వాతావరణం తనకు సెట్ కాదని కేవలం మూడు నెలల్లోనే ఆయన ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నారు.

అటెండెన్స్ పైనే దృష్టి.. పని ఫలితం పై కాదు

ఎడ్విన్ నెట్టో ఉద్యోగం మానేయడానికి ప్రధాన కారణం పని విధానంలోని స్వేచ్ఛ లేకపోవడమే. ఆయన మాటల్లోనే: "భారతదేశంలో, పని గంటల కంటే ఫలితం పైనే ఎక్కువ దృష్టి పెడతారు. కానీ అక్కడ అలా కాదు. ఉదయం 9 గంటలకు పంచింగ్ చేయకపోతే, దాన్ని హాఫ్ డేగా లెక్కించేవారు. అటెండెన్స్‌పై దృష్టి పెట్టి, పనికి బాధ్యత వహించే స్వేచ్ఛ అక్కడ లేదు. అక్కడ సమస్య డబ్బుతో కాదు, మానసికతతో ఉంది"

నాయకత్వ లోపం, టెక్ కల్చర్ సమస్య

యూఏఈలో టెక్నాలజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి అద్భుతంగా ఉన్నప్పటికీ, డిజిటల్ ప్రొడక్ట్ కల్చర్ ఇంకా కొత్తగా ఉందని ఎడ్విన్ అన్నారు. అంతేకాక అక్కడ నాయకత్వం లోపం ఎక్కువగా ఉందని, పెద్ద స్థానాలలో స్థానికులను ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప, సామర్థ్యాన్ని పట్టించుకోరని ఆయన చెప్పారు. ఈ కారణంగానే విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు అక్కడ ఎదగడం కష్టమని ఆయన వివరించారు.

దుబాయ్ వదిలి గూగుల్‌లో ఉద్యోగం

ఆ కారణాలన్నిటి వల్ల, అబుదాబిలోని లక్షల జీతాన్ని వదులుకుని, ఎడ్విన్ నెట్టో భారతదేశానికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని గూగుల్‌లో ప్రొడక్ట్ డిజైనర్‌గా పనిచేస్తూ, భారతీయ వర్క్ కల్చర్‌లో లభించే సౌలభ్యాన్ని, స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story