టికెట్ క్యాన్సిల్ చేయకుండానే తేదీ మార్చుకోవచ్చు

Indian Railways : రైలు ప్రయాణికులకు ఇది నిజంగా పెద్ద శుభవార్త. ఎందుకంటే ఇకపై అత్యవసరంగా రైలు ప్రయాణ తేదీని మార్చుకోవాలంటే, పాత టికెట్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదు. అలాగే క్యాన్సిలేషన్ ఛార్జీ కూడా చెల్లించాల్సిన పనిలేదు. ఈ కొత్త, విప్లవాత్మక మార్పును రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకురాబోతోంది. ఈ కొత్త సదుపాయం జనవరి 2026 నుంచి అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

డబ్బులు కూడా వాపస్ వస్తాయి

ఈ కొత్త నియమంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, మీ కొత్త టికెట్ ఛార్జీ పాత దానికంటే తక్కువగా ఉంటే, ఆ తేడా మొత్తాన్ని రైల్వే మీ ఖాతాకు తిరిగి జమ చేస్తుంది. ఉదాహరణకు, మీరు మొదట రూ. 2000 చెల్లించి టికెట్ బుక్ చేసుకుని, కొత్త తేదీకి ఛార్జీ రూ. 1500 మాత్రమే ఉంటే, రైల్వే మీకు రూ. 500 తిరిగి ఇచ్చేస్తుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న విధానంలో, టికెట్ రద్దు చేస్తే క్లాస్‌ను బట్టి రూ. 60 నుంచి రూ. 240 వరకు క్యాన్సిలేషన్ ఛార్జీ కోల్పోవాల్సి వచ్చేది. ఈ నష్టం ఇకపై ప్రయాణికులకు ఉండదు.

ఎప్పుడు అమలులోకి వస్తుంది?

ఈ కొత్త సదుపాయాన్ని అమలు చేయడానికి రైల్వే తమ బుకింగ్ సాఫ్ట్‌వేర్, వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాల్సి ఉంది. జనవరి 2026 నాటికి ఈ సదుపాయం సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రావాలని రైల్వే మంత్రి ఆదేశించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story