రూ.8,699కే రియల్ మీ లేటెస్ట్ ఫోన్

Realme C71 5G : తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూసేవారికి రియల్ మీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌గా రియల్ మీ C71 5G భారతదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో 6300 mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ బాడీ, డ్యుయల్ వ్యూ వీడియో రికార్డింగ్, ఏఐ ఫీచర్లు, రివర్స్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్, మార్కెట్‌లో దీని పోటీ గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రియల్‌మీ ఫోన్ 4GB RAM/64GB వేరియంట్ ధర రూ.7,699. 6GB RAM/128GB వేరియంట్ ధర రూ.8,699. ఈ ఫోన్ అమ్మకాలు ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో ప్రారంభమయ్యాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా, 6GB వేరియంట్ కొనుగోలు చేసే వారికి రూ.700 బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల ఎల్‌సీడీ డిస్ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 568 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ బడ్జెట్ ఫోన్‌లో యూనిసోక్ T7250 ప్రాసెసర్ ఉపయోగించారు. 6GB మోడల్‌లో అదనంగా 12GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ లభిస్తుంది. దీనివల్ల రూ.8,699 ధరకే 18GB వరకు ర్యామ్ కెపాసిటీ లభిస్తుంది. ఫోన్ వెనుక వైపున 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా సెన్సార్ ఉంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఏఐ ఎరేజర్, ఏఐ క్లియర్ ఫేస్, ప్రో మోడ్, డ్యుయల్ వ్యూ వీడియో వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఫోన్‌లో 6300 mAh బ్యాటరీ ఉంది. ఇది 45W వైర్డ్, 6W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 36 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐపై పనిచేస్తుంది. ఈ ధరల రేంజ్ లో Realme C71 5G, Samsung Galaxy F06 5G, Redmi A4 5G, Lava Yuva 5G, Poco C75 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story