UPI : భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్‎లో విప్లవాత్మక మార్పు తెచ్చిన యూపీఐ ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డులతో అనుసంధానం కావడం ద్వారా మరింత విస్తృతమైంది.

UPI : భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్‎లో విప్లవాత్మక మార్పు తెచ్చిన యూపీఐ ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డులతో అనుసంధానం కావడం ద్వారా మరింత విస్తృతమైంది. అయితే, రూపే క్రెడిట్ కార్డు ఉపయోగించి యూపీఐ ద్వారా చేసే చెల్లింపులు నిజంగా ఉచితమేనా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రూ.2,000 లోపు చేసే లావాదేవీలపై కస్టమర్‌కు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అవి పూర్తిగా ఉచితం. కానీ, రూ.2,000 దాటిన చెల్లింపులపై విధించే 1.1% ఛార్జీని కస్టమర్ కాకుండా వ్యాపారి చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ భారతదేశంలో పేమెంట్స్ మెథడ్ పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో లింక్ చేసి పేమెంట్స్ చేసే కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రూపే క్రెడిట్ కార్డులను నేరుగా యూపీఐ యాప్‌లకు లింక్ చేయడం ద్వారా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్రెడిట్ కార్డు ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు. అయితే, ఈ కొత్త విధానంలో పేమెంట్స్ ఉచితమా కాదా అనేదే ప్రధాన సందేహం. సాధారణ యూపీఐ కస్టమర్లు, రోజువారీ చిన్న లావాదేవీల కోసం NPCI చాలా స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. రూపే క్రెడిట్ కార్డు ఉపయోగించి యూపీఐ ద్వారా చేసే రూ.2,000 వరకు లావాదేవీలపై కస్టమర్‌కు ఎలాంటి ఛార్జీలు పడవు. ఇది పూర్తిగా ఉచితం.


భారతదేశంలో కూరగాయల కొనుగోళ్లు, చిన్న బిల్లులు, క్యాబ్ ఛార్జీలు, చిరుతిండ్లు వంటి చాలా వరకు రోజువారీ లావాదేవీలు ఈ రూ.2,000 పరిమితిలోనే ఉంటాయి. కాబట్టి, సాధారణ వినియోగదారుల రోజువారీ అవసరాలపై అదనపు భారం పడదు. రూ.2,000 దాటిన లావాదేవీలపై ఛార్జీలు ఉన్నాయనే వార్త నిజమే.. కానీ ఆ ఛార్జీని కస్టమర్ చెల్లించాల్సిన అవసరం లేదు. 2023 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చిన నిబంధన ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై గరిష్టంగా 1.1% వరకు ఛార్జీ విధించబడుతుంది. ఈ ఛార్జీని కస్టమర్ కాకుండా, ఆ చెల్లింపును స్వీకరించే వ్యాపారి లేదా దుకాణదారుడు తన బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని సాంకేతిక పరిభాషలో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అంటారు. ఉదాహరణకు, మీరు రూ.25,000 విలువైన వస్తువు కొంటే, మీ ఖాతా నుంచి రూ.25,000 మాత్రమే కట్ అవుతుంది.


యూపీఐ లాంటి విస్తృతమైన డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఖర్చును భరించడం, భవిష్యత్తులో ఈ వ్యవస్థను నిలకడగా కొనసాగించడానికి ఈ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు అవసరమయ్యాయి. యూపీఐ ద్వారా చెల్లింపు క్రెడిట్ కార్డు ద్వారా జరిగినప్పుడు, ఇందులో క్రెడిట్ కార్డు నెట్‌వర్క్ (రూపే), కార్డు జారీ చేసిన బ్యాంకుతో సహా అనేక సంస్థలు పాలుపంచుకుంటాయి. ఈ మొత్తం ప్రక్రియ మెయింటెనెన్స్, టెక్నాలజీ, సేఫ్టీ కోసం భారీ ఖర్చు అవుతుంది. వినియోగదారులపై భారం పడకుండా, ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడానికి, సిస్టమ్ నిరంతరాయంగా పనిచేయడానికి ఈ నామమాత్రపు ఛార్జీని వ్యాపారులపై విధించడం జరిగింది.

PolitEnt Main

PolitEnt Main

Next Story