Saina Nehwal : కశ్యప్‌తో విడిపోయిన సైనా.. ఆమె ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా ?
ఆమె ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా ?

Saina Nehwal : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన భర్త, బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సైనా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 2018లో వివాహం చేసుకున్న ఈ జంట ఏడేళ్ల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. భారత మహిళా షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్తి ఎన్ని కోట్లు అనేది ఈ వార్తలో తెలుసుకుందాం.
సైనా నెహ్వాల్ నికర ఆస్తి విలువ సుమారు రూ.40-50 కోట్లు. ఈ మొత్తం ఆమె క్రీడా వృత్తి, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ఇతర వ్యాపార కార్యకలాపాల ద్వారా సంపాదించారు. తన కెరీర్‌లో సైనా అనేక గొప్ప విజయాలు సాధించారు. వాటిలో 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రజత, కాంస్య పతకాలు, అనేక సూపర్ సిరీస్ టైటిల్స్ ఉన్నాయి.
దీనితో పాటు ఆమె హెర్బాలైఫ్, స్టార్ స్పోర్ట్స్ వంటి అనేక పెద్ద బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీటి ద్వారా ఆమె ఆదాయం పెరిగింది. సైనా తన ఆటతో భారతదేశానికి పేరు తేవడమే కాకుండా, ఆర్థికంగా కూడా బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె ఆస్తిలో ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఆస్తులు, లగ్జరీ కార్లు, ఇతర ఇన్వెస్ట్ మెంట్లు కూడా ఉన్నాయి.
సైనా నెహ్వాల్, కశ్యప్ చిన్నప్పటి నుంచే ఒకరికొకరు తెలుసు. చాలా కాలం డేటింగ్ చేసిన తర్వాత, వారు 2018లో వివాహం చేసుకున్నారు. వారిద్దరూ ఒకరి కెరీర్‌కు ఒకరు ఎప్పుడూ సపోర్టుగా ఉండేవారు. అయితే, వారి విడాకుల వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. సైనా తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ నిర్ణయం వ్యక్తిగతమని, పరస్పర అంగీకారంతో తీసుకున్నామని పేర్కొన్నారు.. కానీ విడాకులకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
