ఆ సీక్రెట్ ఇదే

Invest in SIP : సాయంత్రం వేళ వేడి వేడి టీ తాగడం ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఒక టీ కప్పు, బిస్కెట్ తీసుకుంటే రోజు మొత్తం అలసట మాయమవుతుంది. కానీ, మీరు ప్రతి రోజు టీ కోసం ఖర్చు చేసే ఆ రూ.20లోనే కోటీశ్వరులు అయ్యే సీక్రెట్ దాగి ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ చిన్న పొదుపును ఎలా పెట్టుబడి పెట్టాలో, కోట్లు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం. ఉదాహరణకు, మీరు ప్రతి రోజు సాయంత్రం టీ కోసం సుమారు రూ.20 ఖర్చు చేస్తున్నారని అనుకుందాం. అంటే, నెలలో మీ ఖర్చు రూ.600 అవుతుంది. సంవత్సరానికి సుమారు రూ.7,200 ఖర్చవుతుంది. ఇప్పుడు మీరు ఈ మొత్తాన్ని తాగే టీ కోసం ఖర్చు చేయకుండా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టండి. దీర్ఘకాలంలో సగటున 13% వార్షిక రాబడి వస్తుందని భావిస్తే, ఈ చిన్న పొదుపు అద్భుతాలు సృష్టిస్తుంది.

ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయస్సులో SIP చేయడం ప్రారంభించి, తదుపరి 40 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.600 చొప్పున పెట్టుబడి పెడితే, అతడు మొత్తం రూ.2.88 లక్షలు మాత్రమే పెట్టుబడి పెడతాడు. 13% వార్షిక రాబడితో 70 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఈ మొత్తం రూ.78 లక్షలకు పైగా అవుతుంది. ఇక ఎవరైనా ప్రతి రోజు రూ.30 ఆదా చేసి, నెలకు రూ.900 SIP చేస్తే, 40 సంవత్సరాల తర్వాత అతనికి రూ.1.17 కోట్ల వరకు లభించే అవకాశం ఉంది. ఈ లెక్కలు కాంపౌండింగ్ పవర్ ఏంటో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

సిప్ విజయం వెనుక ఉన్న సీక్రెట్ కాంపౌండింగ్ లేదా వడ్డీపై వడ్డీ సూత్రం. దీని ప్రకారం మీరు పెట్టిన పెట్టుబడిపై వచ్చే వడ్డీ కూడా మళ్లీ పెట్టుబడిగా మారి, దానిపై కూడా వడ్డీ వస్తుంది. మీరు ఎంత త్వరగా పెట్టుబడిని ప్రారంభిస్తే, అంత ఎక్కువ కాలం కాంపౌండింగ్ ప్రభావం పనిచేసి, మీ డబ్బు అంత వేగంగా పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చేసే సిప్ లలో మార్కెట్ పరిస్థితులను బట్టి సంవత్సరానికి సగటున 12% నుంచి 15% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది.

మ్యూచువల్ ఫండ్స్ అనేది షేర్ మార్కెట్‌తో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఇందులో కొంత రిస్క్ ఉంటుంది. అందుకే పెట్టుబడి పెట్టే ముందు మీ పోర్ట్‌ఫోలియోను ఒకే రంగంలో కాకుండా, వివిధ రంగాలలో డివైడ్ చేసి పెట్టాలి. అలాగే, ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

SIP లో పెట్టుబడి పెట్టడం ఎలా?

* SIP అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఒక సులభమైన మార్గం.

* మీరు ఏదైనా నమ్మకమైన పెట్టుబడి ప్లాట్‌ఫామ్ లేదా మొబైల్ యాప్‌లో (ఉదాహరణకు: జెరోధా, గ్రోవ్, పేటీఎం మనీ మొదలైనవి) మీ అకౌంట్‌ను తెరవవచ్చు.

* అందులో మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవాలి.

* ఆ తర్వాత, మీ సౌలభ్యం ప్రకారం నెలవారీ సిప్ మొత్తాన్ని నిర్ణయించి, ఆటో-డెబిట్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి.

* ఒకసారి ఆటో-డెబిట్ ప్రారంభించిన తర్వాత, ప్రతి నెలా నిర్ణీత తేదీన మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయ్యి, మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి అవుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story