Old Monk Rum : 71 ఏళ్ల చరిత్ర.. ధర కేవలం రూ.355.. ఈ ఇండియన్ రమ్ ఎందుకంత ఫేమస్?
ఈ ఇండియన్ రమ్ ఎందుకంత ఫేమస్?

Old Monk Rum : శీతాకాలం మొదలు కాగానే మద్యం ప్రియులలో రమ్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది. మీరు కూడా మద్యం సేవించడానికి ఇష్టపడేవారైతే ఈ రోజు 71 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక భారతీయ రమ్ గురించి తెలుసుకుందాం. అదే ఓల్డ్ మాంక్. చాలా మందికి ఇది ఆల్ టైమ్ ఫేవరెట్. తక్కువ ధరలో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ఈ రమ్, దశాబ్దాలుగా భారత మార్కెట్‌పై తనదైన ముద్ర వేసింది. దీన్ని 1954 నుంచి మోహన్ మీకిన్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తోంది.
ఓల్డ్ మాంక్ రమ్ ప్రత్యేకతలు
ఓల్డ్ మాంక్ రమ్ అనేది భారతదేశానికి చెందిన ఒక ఐకానిక్, అత్యంత ప్రజాదరణ పొందిన డార్క్ రమ్. ఈ రమ్ దాని స్మూత్ టెక్స్‌చర్, ప్రత్యేకమైన వెనిలా, కారమెల్ ఫ్లేవర్‌ల కోసం చాలా ప్రసిద్ధి చెందింది. ఓల్డ్ మాంక్ రమ్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన రకం 7 ఇయర్స్ ఓల్డ్ వెయిటెడ్ డార్క్ రమ్. దీన్ని కనీసం 7 సంవత్సరాలు ఓక్ బారెల్స్‌లో ఉంచుతారు. ఈ రమ్ ఎక్కువగా కారమెల్, వెనిలా , డార్క్ చాక్లెట్ ఫ్లేవర్‌లతో ఉంటుంది.
ఇది అత్యంత ప్రీమియం వెర్షన్. దీనిని ఏకంగా 18 సంవత్సరాల పాటు నిల్వ చేస్తారు. దీని స్మూత్, రిచ్ రుచికి ఇది ప్రసిద్ధి చెందింది. చాలా ఓల్డ్ మాంక్ వెర్షన్లలో ఆల్కహాల్ శాతం 42.8% ఉంటుంది. ఇది విస్కీతో పోలిస్తే కొంచెం ఎక్కువ. ఓల్డ్ మాంక్ రమ్ భారతదేశంలో చాలా మంది రమ్ ప్రియులకు ఇష్టమైన ఎంపిక. దీనిని భారతదేశంలోని ఉత్తమ రమ్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. ఒక లీటర్ ఫుల్ బాటిల్ రూ.1,000 లోపు కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, ఢిల్లీలో 180ఎంఎల్ బాటిల్ ధర సుమారుగా రూ.355 ఉంటుంది. అయితే ఈ ధరలు నగరం, బాటిల్ పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఓల్డ్ మాంక్ భారతదేశంలో చాలా సులభంగా దొరుకుతుంది. చాలా మద్యం దుకాణాలలో లేదా కొన్ని రాష్ట్రాల్లో లైసెన్స్ పొందిన ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

