రూ.10 కోట్లు పక్కా

SIP Investment Plan : మీరు సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తుంటే సిస్టమటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) బెస్ట్ ఆప్షన్. ఇక్కడ లాభం ఎక్కువగా ఉంటూ షేర్ మార్కెట్‌తో పోలిస్తే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 25 ఏళ్ల వయసు నుంచి మొదలుపెట్టి 60 ఏళ్లలోపు రూ.10 కోట్ల భారీ ఫండ్‌ను సిప్ ద్వారా సులభంగా నిర్మించుకోవచ్చు. ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడంలో చక్రవడ్డీ కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెడితే మీ డబ్బు పెరగడానికి అంత ఎక్కువ సమయం లభిస్తుంది.

ఫండ్స్‌ఇండియా వెల్త్ కన్వర్సేషన్స్ 2025 నివేదిక ప్రకారం.. మీరు SIP ద్వారా ఏడాదికి సగటున 12% రిటర్న్ పొందుతారనే అంచనాతో ఈ లెక్కలను వేశారు. రూ.10 కోట్ల ఫండ్‌ను నిర్మించడానికి వయసును బట్టి ఎంత కట్టాలో చూడండి. మీరు 25 ఏళ్ల వయసులో SIP మొదలుపెడితే, 35 ఏళ్ల కాలపరిమితికిగాను నెలకు కేవలం రూ.15,396 కడితే సరిపోతుంది. అదే మీరు ఐదేళ్లు ఆలస్యం చేసి 30 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే, 30 ఏళ్ల కాలానికిగాను నెలవారీ SIP మొత్తం దాదాపు రెట్టింపు అవుతుంది, అంటే ₹28,329 చెల్లించాలి. ఒకవేళ మీరు 35 ఏళ్ల వయసులో మొదలుపెట్టాలనుకుంటే, నెలకు రూ.52,697 కట్టాల్సి వస్తుంది. ఇక 40 ఏళ్ల వయసులో మొదలుపెట్టేవారు 20 ఏళ్ల కాలానికిగాను నెలకు రూ.1,00,085 పెట్టుబడి పెట్టాలి. దీన్ని బట్టి చూస్తే పెట్టుబడి పెట్టడంలో ఎంత త్వరగా మొదలుపెడితే అంత తక్కువ డబ్బు కట్టాల్సిన అవసరం ఉంటుంది.

SIP తో పాటు ఒకేసారి పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల వయసులో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, అది 60 ఏళ్ల నాటికి సుమారు రూ.93 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. అదే రూ.లక్షను మీరు 40 ఏళ్ల వయసులో పెడితే, అది కేవలం రూ.9 లక్షల వరకే పెరుగుతుంది. దీని అర్థం మీ డబ్బు వృద్ధి చెందడానికి తగినంత సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. అందుకే మీరు ఎంత త్వరగా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయడం మొదలుపెడితే, భవిష్యత్తులో అంత పెద్ద మొత్తంలో ఫండ్‌ను నిర్మించుకోగలుగుతారు. ఈ రోజు మీరు చేసే చిన్న చిన్న పొదుపులు పెద్ద మొత్తంలో మీకు తిరిగి లాభాన్ని అందిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story