ఆయనకు ఇష్టమైన డ్రింక్ ఏంటి?

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన భారీ ర్యాలీలలో అయినా విందులలో అయినా, ప్రపంచ నాయకులతో చర్చల్లో అయినా, ట్రంప్ ఎప్పుడూ వైన్ లేదా విస్కీ తీసుకోరు. బదులుగా ఆయన తనకి అత్యంత ఇష్టమైన డ్రింక్ అయిన డైట్ కోక్‌నే అడుగుతారు. ఈ అలవాటు ఎంత ప్రసిద్ధి చెందిందంటే వైట్ హౌస్‌లో కేవలం ఆయన కోసం డైట్ కోక్ అడగడానికి ఒక ఎర్ర బటన్‌ను కూడా ఏర్పాటు చేశారు.

తాను తన జీవితంలో ఒక చుక్క మద్యం కూడా తాగలేదని ట్రంప్ చాలాసార్లు బహిరంగంగా చెప్పారు. ఒక సందర్భంలో "నేను మద్యం తాగి ఉంటే, ప్రపంచంలోనే అత్యంత చెడ్డ వ్యక్తిగా ఉండేవాడిని" అని సరదాగా కూడా అన్నారు. ఆయన సన్నిహితులు కూడా ట్రంప్ జీవితంలో మద్యంకు చోటు లేదని, ఆయన కేవలం నీళ్లు, డైట్ కోక్ మాత్రమే తీసుకుంటారని ధృవీకరించారు. అయితే ట్రంప్ మద్యం సేవించకపోవడం కేవలం ఒక అలవాటు కాదు. దీని వెనుక ఒక బాధాకరమైన కుటుంబ కథనం దాగి ఉంది.

డోనాల్డ్ ట్రంప్ తమ ఐదుగురు తోబుట్టువులలో నాలుగవ వారు. ఆయన అన్నయ్య ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ ఒక ఎయిర్‌లైన్ పైలట్. కానీ మద్యానికి బానిస కావడం వల్ల ఆయన జీవితం పూర్తిగా నాశనం అయింది. నిరంతర మద్యం సేవనం కారణంగా ఆయన కెరీర్ ముగియడమే కాకుండా, కేవలం 42 సంవత్సరాల చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు. ఫెర్డ్ జూనియర్ ఎప్పుడూ తన తమ్ముడైన డోనాల్డ్ ట్రంప్‌తో, మద్యం అస్సలు తాగవద్దు అని చెప్పేవారు. అన్నయ్య సలహా, అలాగే ఆయన పడిన కష్టం, తండ్రి ఆగ్రహం ట్రంప్ మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే జీవితాంతం మద్యంకు దూరంగా ఉండాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు.

పిల్లల కోసం కఠిన నియమం

తన అన్నయ్య దురదృష్టకర మరణం నుంచి నేర్చుకున్న ట్రంప్, తన పిల్లల విషయంలో చాలా కఠినమైన నియమాన్ని అమలు చేశారు. చిన్నప్పటి నుంచే వారికి "మద్యం వద్దు, డ్రగ్స్ వద్దు, పొగ తాగడం వద్దు" అనే రూల్ పెట్టారు. తన ధనవంతులైన స్నేహితుల పిల్లలు చాలా మంది మద్యం, డ్రగ్స్ వల్ల జీవితాలను నాశనం చేసుకున్నారని, తన పిల్లల విషయంలో అలాంటిది జరగకూడదనే భయంతో ఆయన ఈ నియమాన్ని పాటించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story