Truecaller : మిస్డ్ కాల్స్ టెన్షన్ ఇకపై లేదు.. ట్రూకాలర్ నుంచి మ్యాజిక్ ఫీచర్
ట్రూకాలర్ నుంచి మ్యాజిక్ ఫీచర్

Truecaller : ట్రూకాలర్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాయిస్‌మెయిల్ అనే కొత్త ఫీచర్‌ను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. మీరు బిజీగా ఉండటం వల్ల కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోయినా, అవతలి వ్యక్తి వాయిస్‌మెయిల్‌గా సందేశాన్ని పంపవచ్చు. ఈ వాయిస్‌మెయిల్ సందేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో టెక్స్ట్‌లోకి మారుస్తుంది. ముఖ్యంగా ఈ టెక్స్ట్ మెసేజ్ వినియోగదారులకు వారి ప్రాంతీయ భాషలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం అన్ని రకాల వినియోగదారులకు (ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేని వారికి కూడా) ఉచితంగా లభిస్తుంది.
ఈ వాయిస్‌మెయిల్ ఫీచర్ ద్వారా స్పామ్ కాల్‌లను ఫిల్టర్ చేయడం, వాయిస్‌మెయిల్ ప్లేబ్యాక్ వేగాన్ని మార్చుకునే అవకాశం, స్మార్ట్ కాల్ వర్గీకరణ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫీచర్ 12 భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఇందులో హిందీ, మరాఠీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, నేపాలీ, గుజరాతీ, సంస్కృతం, పంజాబీ, ఉర్దూ ఉన్నాయి. ట్రూకాలర్ ప్రకారం.. ఈ ఫీచర్ సందేశాన్ని నేరుగా వినియోగదారు డివైస్‌లో నిల్వ చేస్తుంది, దీని ద్వారా రికార్డింగ్‌పై పూర్తి కంట్రోల్, ప్రైవసీ లభిస్తుంది. అయితే ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు మాత్రం కాల్‌కు బదులివ్వడం, కాల్ చేసేవారితో సంభాషించడం, పర్సనల్ అభినందనలు పంపడం వంటి అధునాతన సౌకర్యాలతో కూడిన ట్రూకాలర్ అసిస్టెంట్ ఫీచర్‌ను పొందవచ్చు.
ట్రూకాలర్ వాయిస్‌మెయిల్ ఫీచర్‌ను ఉపయోగించడానికి, వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌పై కాల్ ఫార్వార్డింగ్ సదుపాయాన్ని తప్పనిసరిగా ఆన్ చేయాలి. సెటప్ పూర్తయిన తర్వాత, వాయిస్‌మెయిల్ టెక్స్ట్‌గా మారడానికి కొద్ది సమయం పట్టవచ్చు. అన్ని వాయిస్‌మెయిల్ మెసేజ్ లను యాప్‌లోని వాయిస్‌మెయిల్ ట్యాబ్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు తమ ట్రూకాలర్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి.

