భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ విప్లవానికి కేంద్రంగా ఉన్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ రోజురోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

UPI : భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ విప్లవానికి కేంద్రంగా ఉన్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ రోజురోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. గత నెల (అక్టోబర్)లో 2,070 కోట్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు నమోదయ్యాయి. ఒక నెలలో 2,000 కోట్ల ట్రాన్సాక్షన్లు దాటడం ఇది రెండోసారి. అంతేకాకుండా అక్టోబర్‌లో జరిగిన ఈ లావాదేవీల విలువ కూడా రూ. 27.28 లక్షల కోట్లుగా నమోదై సరికొత్త శిఖరాన్ని చేరుకుంది. ముఖ్యంగా ఆగస్టు 18న ఒకే రోజు 75 కోట్లకు పైగా లావాదేవీలు జరి యూపీఐ కింగ్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి.

భారతదేశంలో డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసిన యూపీఐ, గత నెల అక్టోబర్‌లో అత్యధిక లావాదేవీలు, అత్యధిక విలువను నమోదు చేసింది. అక్టోబర్ నెలలో మొత్తం 2,070 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. ఒక నెలలో 2,000 కోట్ల ట్రాన్సాక్షన్లు దాటడం రెండోసారి. గతంలో ఆగస్టు నెలలో 2,001 కోట్ల లావాదేవీలు, సెప్టెంబర్‌లో 1,963 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఈ లావాదేవీల ద్వారా మొత్తం రూ. 27.28 లక్షల కోట్ల విలువైన డబ్బు బదిలీ జరిగింది. ఇది కూడా ఇప్పటివరకు జరిగిన నెలవారీ యూపీఐ లావాదేవీల విలువలో రికార్డుగా నిలిచింది. ఆగస్టులో రూ. 24.85 లక్షల కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 24.90 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.


యూపీఐ ఒక రోజులో జరిగిన లావాదేవీల సంఖ్యలో కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అందించిన డేటా ప్రకారం.. ఆగస్టు 18న ఒకే రోజు 75.43 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక రోజులో ఇంత పెద్ద సంఖ్యలో లావాదేవీలు జరగడం ఇదే ప్రథమం. భారతదేశంలో అందుబాటులో ఉన్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలలో యూపీఐ తన తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మొత్తం డిజిటల్ లావాదేవీల సంఖ్యలో యూపీఐ వాటా ఏకంగా 84.4 శాతంగా ఉంది. నెఫ్ట్ ద్వారా 3.9 శాతం, ఐఎంపీఎస్ ద్వారా 2.1 శాతం లావాదేవీలు జరుగుతున్నాయి.

అయితే, లావాదేవీల విలువ పరంగా చూస్తే యూపీఐ వాటా కేవలం 9 శాతం మాత్రమే. అధిక విలువ కలిగిన లావాదేవీల కోసం ఉపయోగించే ఆర్టీజీఎస్ సిస్టమ్, మొత్తం విలువలో 69 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. యూపీఐ చిన్న మొత్తాల చెల్లింపులకు ఎక్కువగా ఉపయోగపడుతోంది, దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. యూపీఐ ప్రధానంగా చిన్న మొత్తాల చెల్లింపులకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. రోజువారీ లావాదేవీలపై పరిమితులు ఉండటం వలన, రూ. 2 లక్షల కంటే ఎక్కువ మొత్తాలను పంపడానికి ప్రజలు ఆర్టీజీఎస్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

PolitEnt Main

PolitEnt Main

Next Story