Vi : జియో, ఎయిర్ టెల్ కు షాక్.. 23 నగరాల్లో Vi 5G హై-స్పీడ్ ఇంటర్నెట్
23 నగరాల్లో Vi 5G హై-స్పీడ్ ఇంటర్నెట్

Vi : భారతదేశంలో స్పీడు ఇంటర్నెట్ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఈ పోటీలో ఇప్పుడు Vi కూడా దూసుకువస్తోంది. దేశంలోని మరో 23 నగరాల్లో త్వరలో తమ 5G సేవలను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనివల్ల లక్షలాది మంది వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్రయోజనం లభిస్తుంది. Vi, జియో, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వగలదు.
Vi 5G సేవలను ప్రారంభించాలని ప్లాన్ చేసిన 23 నగరాలు.. అహ్మదాబాద్, ఆగ్రా, ఔరంగాబాద్, కోజికోడ్, కొచ్చిన్, డెహ్రాడూన్, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, లక్నో, మధురై, మలప్పురం, మీరట్, నాగ్‌పూర్, నాసిక్, పూణే, రాజ్‌కోట్, సోనిపట్, సూరత్, సిలిగురి, త్రివేండ్రం, వడోదర, వైజాగ్. ఈ నగరాలకు ఇప్పటికే 5G స్పెక్ట్రమ్ కేటాయించబడింది. Vi ఇప్పుడు వీటిని ఉపయోగించి త్వరలో తన నెట్‌వర్క్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.
వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ వల్ల హెచ్‌డి వీడియోలు, గేమింగ్, పెద్ద ఫైల్‌లు ఇప్పుడు కొన్ని సెకన్లలోనే డౌన్‌లోడ్ అవుతాయి. Vi తన నెట్‌వర్క్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని కూడా ఉపయోగించింది. దీనివల్ల నెట్‌వర్క్ క్వాలిటీ ఆటోమెటిక్‌గా మెరుగుపడుతుంది. అంతేకాదు, విద్యుత్ కూడా ఆదా అవుతుంది. 5G వల్ల స్మార్ట్ ట్రాఫిక్, ఐఓటీ పరికరాలు, డిజిటల్ గవర్నెన్స్ వంటివి వేగంగా అభివృద్ధి చెందుతాయి.
Vi ప్రారంభంలోనే వినియోగదారులను ఆకర్షించడానికి రూ.299 నుండి ప్రారంభమయ్యే ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే Vi 5G ప్లాన్‌లు ప్రస్తుతం చౌకగా ఉన్నాయని చెబుతున్నారు. Vi 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన చోట్ల 70 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు దీనిని ఉపయోగిస్తున్నారని, వినియోగదారులు దాని స్పీడ్ ఇష్టపడుతున్నారని కంపెనీ చెబుతోంది.
Vi 5Gని ప్రకటించినప్పటికీ, కొంతమంది వినియోగదారులు ఇప్పటికీ దాని నుండి దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ట్రాయ్ నివేదిక ప్రకారం.. మే 2025లో 2.74 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులు Vi నెట్‌వర్క్‌ను విడిచిపెట్టారు. ఇప్పుడు కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 20.44 కోట్లకు తగ్గింది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జియో, ఎయిర్‌టెల్ వైపు చూస్తే ఈ రెండు కంపెనీలు నిరంతరం లాభపడుతున్నాయి.
