జియో-ఎయిర్‌టెల్‌కి వణుకు పుట్టిస్తున్న విఐ ప్లాన్!

Vi Plans : అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ కోసం చూస్తున్నారా? రోజుకు 1GB, 2GB లిమిట్స్ చాలట్లేదా? అయితే మీకు ఒక శుభవార్త.. వోడాఫోన్ ఐడియా దగ్గర కొన్ని సూపర్ ప్లాన్స్ ఉన్నాయి. వీటితో రోజులో 12 గంటల పాటు అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. ఇవి జియో, ఎయిర్‌టెల్ లాంటి పెద్ద కంపెనీలకు కూడా టెన్షన్ పుట్టిస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా దగ్గర కేవలం రూ.365తో ఒక అదిరిపోయే ప్లాన్ ఉంది. మీరు రోజులో ఏ 12 గంటలైనా ఎంచుకొని, ఆ సమయంలో ఎంత డేటా అయినా వాడుకోవచ్చు. మీరు సినిమా చూడండి, గేమ్స్ ఆడండి, వీడియో కాల్స్ చేయండి... లిమిట్ ఉండదు. ఏ నెట్‌వర్క్‌కి అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతి రోజు 100 SMS పంపించుకోవచ్చు. ఈ రూ.365 ప్లాన్‌కు 28 రోజుల వాలిడిటీ వస్తుంది. అంటే, 28 రోజుల పాటు మీరు ఈ అన్ని బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్‌తో కొన్ని అదనపు లాభాలు కూడా ఉన్నాయి. వీకెండ్ డేటా రోల్‌ఓవర్ అంటే వారంలో మిగిలిన డేటా మొత్తం శని, ఆదివారాల్లో వాడుకోవచ్చు. అంతేకాకుండా Vi యాప్‌లో సినిమాలు, టీవీ షోలు ఉచితంగా చూడొచ్చు.

ప్రస్తుతానికి జియో లేదా ఎయిర్‌టెల్ దగ్గర Vi ప్లాన్ లాగా 12 గంటల పాటు అన్‌లిమిటెడ్ డేటా ఇచ్చే ప్లాన్ ఏదీ లేదు. ఎయిర్‌టెల్ దగ్గర రూ.365 ప్లాన్ లేదు. కానీ రూ.379 ప్లాన్ ఉంది. దీనితో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS వస్తాయి. అలాగే అన్‌లిమిటెడ్ 5G డేటా, స్పామ్ అలర్ట్, ఉచిత హెలోట్యూన్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

జియో దగ్గర రూ.399 ప్లాన్ ఉంది. దీనితో రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS వస్తాయి. జియో అన్‌లిమిటెడ్ 5G ఆఫర్, 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రీఛార్జ్ చేసే ముందు, మీరు ఎంచుకున్న ప్లాన్‌తో వచ్చే బెనిఫిట్స్ అన్నీ సరిగా చదువుకోవాలి. లేదంటే, తర్వాత ఇబ్బంది పడాల్సి రావచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story