Mutual Funds : ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ షేర్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ కూడా ఈ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనూ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తూ, నమ్మకమైన రాబడులను అందిస్తున్న ఒక ప్రత్యేకమైన మ్యూచువల్ ఫండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం నెలకు రూ.1,000 ఎస్‌ఐపీపెట్టుబడితో లక్షల రూపాయల ఫండ్‌ను సృష్టించిన వైనం ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తోంది.

మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ తన పాత థిమాటిక్ అడ్వాంటేజ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ను ఇప్పుడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అగ్రెసివ్ హైబ్రిడ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ గా మార్చింది. ఈ మార్పు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఫండ్ ప్రధానంగా 65-80 శాతం ఈక్విటీలో, మిగిలిన 20-35 శాతం డెట్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల మార్కెట్ పడిపోయినప్పుడు డెట్ పోర్ట్‌ఫోలియో అండగా నిలుస్తుంది, మార్కెట్ పెరిగినప్పుడు ఈక్విటీలు భారీ లాభాలను అందిస్తాయి.

గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఫండ్ తన సత్తాను చాటుకుంది. 2003 డిసెంబర్‌లో పెట్టిన రూ.1 లక్ష ఏకమొత్తం పెట్టుబడి 2026 మార్చి నాటికి సుమారు రూ.20.34 లక్షలుగా మారింది. అంటే దాదాపు 14.47 శాతం వార్షిక వృద్ధి రేటును (CAGR) సాధించింది. గత మూడు మరియు ఐదేళ్లలో ఈ ఫండ్ వరుసగా 15.1%,14.9% రిటర్న్స్ ఇచ్చింది. ఇది నిఫ్టీ-200 టీఆర్ఐ బెంచ్‌మార్క్ కంటే మెరుగైన ప్రదర్శన కావడం విశేషం.

సాధారణ మధ్యతరగతి ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ ఒక వరంలా మారింది. గత 10 సంవత్సరాలుగా నెలకు రూ.1,000 చొప్పున ఎస్‌ఐపీ చేసిన వారి పెట్టుబడి విలువ ఇప్పుడు రూ.21 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి వారు ఇన్వెస్ట్ చేసింది రూ.12 లక్షలు కాగా, వారికి దాదాపు 11 శాతం సీఏజీఆర్ రేటుతో లాభం దక్కింది. ఐదు మరియు ఏడేళ్ల కాలపరిమితిలో ఎస్‌ఐపీపై రాబడులు వరుసగా 9.4%, 9.8% గా ఉన్నాయి. మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతున్న సమయంలోనూ స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది చక్కని ఎంపిక.

ఎక్కడ పెట్టుబడి పెడుతుంది?

ఈ ఫండ్ నేరుగా షేర్లలో కాకుండా ఇతర సక్సెస్‌ఫుల్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల విభిన్న రంగాల నిపుణులైన ఫండ్ మేనేజర్ల నైపుణ్యం ఇన్వెస్టర్లకు లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్ (11%), లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ (6.5%), ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ (6.4%) వంటి టాప్ హోల్డింగ్స్ ఉన్నాయి. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఎనర్జీ వంటి కీలక రంగాల్లో ఈ ఫండ్ తన పెట్టుబడులను కొనసాగిస్తూ స్థిరమైన వృద్ధిని అందిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story